Begin typing your search above and press return to search.

కేసీఆర్ చీప్‌ లిక్కర్‌ సీఎం:రేవంత్

By:  Tupaki Desk   |   8 Nov 2018 12:39 PM GMT
కేసీఆర్ చీప్‌ లిక్కర్‌ సీఎం:రేవంత్
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. టీఆర్ ఎస్ - మ‌హా కూట‌మి నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఆప‌ద్ధ‌ర్మ మంత్రి హ‌రీష్ రావు...టీఆర్ ఎస్ ను వీడేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వంటేరు ప్ర‌తాప్ - రేవూరి ప్ర‌కాష్ లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ తో హ‌రీష్ ట‌చ్ లో ఉన్నార‌ని వారు చేసిన‌ షాకింగ్ కామెంట్స్ టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపాయి. ఆ వ్యాఖ్య‌ల‌ను హ‌రీష్ ఖండించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా టీఆర్ ఎస్ లో అంత‌ర్గ‌త విభేదాలున్నాయ‌ని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కు - హరీష్‌ రావుకు మధ్య తీవ్ర విభేదాలున్నాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హరీష్ తో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాతే గజ్వేల్‌ నర్సారెడ్డి కాంగ్రెస్‌ లో చేరారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై రేవంత్ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చీప్‌ లిక్కర్‌ సీఎం కంటే సీల్డ్‌ కవర్‌ సీఎం బెట‌ర్ అన్నారు. కాంగ్రెస్‌ - టీడీపీ కలయికను తప్పుపట్టడం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. మామా అల్లుళ్ల మధ్య విభేదాలు పెచ్చుమీరాయని - వారిద్ద‌రికి స‌ఖ్య‌త లేద‌ని అన్నారు. కారు డ్రైవర్‌ ను మార్చాలని హరీష్ ప్ర‌యత్నిస్తున్నారన్నారు. టీఆర్ ఎస్ లో అంత‌ర్గ‌త కుమ్ములాటలు ఎక్కువ‌య్యాయని, ఏక్ష‌ణంలోనైనా...ఆ పార్టీలో క‌ల‌త‌లు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతాయ‌న్నారు. హరీష్ తో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాతే గజ్వేల్‌ నర్సారెడ్డి కాంగ్రెస్‌ లో చేరారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాల కోసం మినిస్టర్‌ క్వార్టర్స్‌ లో గత నెల 25వ తేదీ సీసీ ఫుటేజిని బయటపెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ప్రకటించిన 105 మందిలో 40 మంది ఎట్టి పరిస్ధితిల్లోనూ గెలవరన్నారు.