Top News: ఈ రోజు ముఖ్యాంశాలు

Wed Jan 16 2019 16:38:20 GMT+0530 (IST)

1.తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే వేడి పుట్టే భేటి ఈరోజు జరిగింది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు తెలంగాణ సీఎం కేసీఆర్ కోరిక మేరకు హైదరాబాద్ లో జగన్ నివాసంలో భేటి అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం జగన్ తో భేటి అయ్యానని కేటీఆర్ తెలుపగా.. ప్రత్యేక హోదా కోసం టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఫైట్ చేస్తామని జగన్ వివరించారు.2. ప్రతిపక్ష నేత జగన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటి తర్వాత స్వయంగా సీఎం కేసీఆర్ ఆంధ్రా వెళ్లి జగన్ తో భేటి అవుతారని ఇరువురు నేతలు కీలక ప్రకటన చేశారు.

3. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన యాదవరెడ్డి భూపతిరెడ్డి రాములు నాయక్ లపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ స్వామి గౌడ్ బుధవారం  ఉత్తర్వులు జారీ చేశారు.

4. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక మూవీ ‘సైరా’లో నటిస్తున్న విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా ఆయన బందిపోటు గెటప్ లో ఉన్న ఫొటో ఒకటి బయటకు రిలీజ్ చేశారు.

5. సంక్రాంతి వేడుకల్లో భాగంగా సొంతూరు పాలకొల్లు వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ తన తాత పేరున ఒక ఫంక్షన్ హాల్ కడుతానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

6.తెలంగాణ అసెంబ్లీ ఈనెల 17న భేటికానుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

7.కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేసే పనిలో బీజేపీ ఉంది.  బీజేపీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి సదూర ప్రాంతానికి తరలించేసింది. తమ 104 మంది ఎమ్మెల్యేలను గుర్గావ్ తరలించింది. రిసార్ట్ లో రాజకీయం నడుపుతోంది.  

8.కెన్యా రాజధాని నైరోబీలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. వెస్ట్ ల్యాండ్స్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ‘డస్టిట్ డీ2’ హోటల్ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి ముష్కరులు ప్రవేశించి దాడి చేయడంతో మొత్తం 15మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

9.హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు అనీశా రెడ్డితో తమిళ హీరో విశాల్ కు పెళ్లి కుదిరింది. అనీశా రెడ్డి గతంలో పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి మూవీల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది.

10. ఇద్దరు స్వతంత్రులు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెట్టినా వారు తనతో టచ్ లో ఉన్నారని.. కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వానికి ఢోకా లేదని కర్ణాటక సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు.

11. సీబీఐ డైరెక్టర్ గా ఐపీఎస్ ఆఫీసర్ నాగేశ్వరరావు నియమాకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వాజ్యం దాఖలు కాగా.. విచారణ వచ్చే వారినికి వాయిదా పడింది.

12. మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తన ఫారెన్ ప్రియుడు జోనుతో నిశ్చితార్థం చేసుకుంది.

13.పనిచేయని కాంగ్రెస్ సారథ్యంలోని ప్రాంతీయ పార్టీల కూటమి వద్దని.. నిర్ణయాత్మక ప్రధాని కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు..

14. బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్ యూరప్ ఎగ్జిట్ పై పార్లమెంట్ ఓటింగ్లో ఆమె ఓడిపోయారు. దీంతో ఆమె ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఎదురైంది.

15. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో ఉత్కంఠ భరితంగా గెలిచిన భారత్ హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూడ్ లోనే విరాట్ కోహ్లీ ఫన్నీ బొమ్మను షేర్ చేసిన ఆయన భార్య అనుష్క శర్మ క్యూట్ అంటూ విడుదల చేసిన ఫొటో వైరల్ గా మారింది.

16.శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయంలోకి వెళ్లాలనుకున్న ఇద్దరు మహిళలను ఆందోళన కారులు అడ్డుకున్నారు.

17. సినీ హాస్యనటుడు బ్రహ్మానందం అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను ముంబైలోని ఏహెచ్ఐకి తరలించగా గుండెకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు.

18.బీఎస్పీ అధినేత్రి మాయావతి 63వ పుట్టినరోజు సందర్భంగా  అమ్రెహాలో బీజేపీ కార్యకర్తలు తెచ్చిన 63 కేజీల కేకును స్థానికులు ఎగబడి చోరీ చేయడం సంచలనం రేపింది. ఆ వీడియో వైరల్ గా మారింది.

19. హెచ్1బీ వీసాల్లో మార్పుల వల్ల భారతీయులను చేర్చుకునే ఐటీ కంపెనీలకు శరాఘాతమని ఐక్రా రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది.

20.జగన్ -కేటీఆర్ భేటిపై టీడీపీ భగ్గుమంది. మంత్రి ఉమ టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీపై ఆడిపోసుకున్నారు.

21.గడిచిన రెండు సంవత్సరాల్లో జనవరి 15వ తేదీనే వరుసగా సెంచరీలు చేస్తూ భారత క్రికెట్ జట్టుకెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డులు నమోదు చేస్తున్నారు.