Top News:ఈ రోజు ముఖ్యాంశాలు

Sat Jan 12 2019 17:03:15 GMT+0530 (IST)

1. ‘F2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ పేరుతో దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈరోజు రిలీజ్ అయిన వెంకటేశ్ - వరుణ్ తేజ్ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.2. ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు లేఖ రాశారు. జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై తీవ్ర నిరసన తెలిపారు.

3.  ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాల మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ బృందం  ఏపీలో పర్యటించి జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏపీ ప్రజల నాడిని పసిగట్టినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయమని 15-20 సీట్లు వస్తాయని అందులో తేలింది.

4. నాని హీరోగా రూపొందుతున్న ‘జెర్సీ’ టీజర్ విడుదలైంది. టీజర్ లోనే ఆసక్తికరంగా డైలాగులు క్రికెట్ నేపథ్యం ఉండి ఆకట్టుకుంటోంది.

5. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ - బీఎస్పీ పొత్తు ఖారారైంది. మొత్తం 80 సీట్లలో ఎస్పీ-38 - బీఎస్పీ 38 ఎంపీ సీట్లలో పోటీచేయాలని రెండు సీట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సోనియాగాంధీలకు వదిలేయాలని నిర్ణయించారు.

6. అమరావతిలో ఐకానిక్ వంతెన సహా రెండు కీలక ప్రాజెక్టులకు ఏపీ సీఎం చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేశారు.

7.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తో ఈసారి పోటీపడేందుకు తొలి భారతీయ మహిళ తులసి గబ్బార్డ్ సిద్ధమవుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ ఆమెకు మద్దతుగా నిలుస్తోంది.

8. హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీకి వెళ్లే రహదారులన్నీ జనంతో పోటెత్తుతున్నాయి. హైవేలన్నీ నిండిపోయాయి. టోల్ గేట్ల వద్ద కార్ల పెద్ద క్యూ కనిపిస్తోంది.

9.ఇడుపులపాయలోని వీరన్నగట్టుపల్లి  గండి వీరాంజనేయస్వామి క్షేత్రాన్ని సందర్శించి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దర్శించుకున్నారు.

10.జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావును శనివారం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధుపులోకి తీసుకుంది.

11.తాజాగా పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో డేరాబాబాతోపాటు ముగ్గురిని కూడా హంతకులుగా కోర్టు తేల్చింది. అయితే శిక్షను మాత్రం ఈ నెల 17న కోర్టు తీర్పు రానుంది.

12. జయలలిత నివాసం ఉండే కొడనాడు ఎస్టేట్ లోని హత్యల వెనుక సీఎం ఫళని స్వామి ఉన్నాడని నిందితుడు సయాన్ ఇంటర్వ్యూలో పేర్కొనడం తమిళనాట రాజకీయ దుమారాన్ని రేపింది.

13.ప్రధాని మోడీకి ఇంగ్లీష్ మాట్లాడడం సరిగా రాదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.ఇంగ్లీష్ లో ఆయన మాట్లాడాలనుకుంటే టెలిప్రాంప్టర్ సాయం తీసుకుంటున్నారని దీదీ దెప్పిపొడిచారు.

14.టీడీపీ  - వైసీపీ - బీజేపీలకు చెందిన పలువురు నాయకులు జనసేన వైపు చూస్తున్నారని.. వారందరికీ స్వాగతం పలుకుతున్నామని జనసేనాని పవన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

15.ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరుఫున ధోని వన్డేల్లో పదివేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ఐదో ఆటగాడిగా అరుదైన ఘనతను సాధించాడు.

16.యూపీలో ఎస్పీ  బీఎస్పీ పొత్తును చాలా డేంజర్ మిస్టేక్ గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఇది మోడీకి మేలుచేయడానికేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ స్పష్టం చేశారు.

17.పెట్రో డీజిల్ ధరలు తాజాగా మరోసారి పెరిగాయి. లీడర్ పెట్రోల్ పై 19 పైసలు ఢీజిల్ పై 29 పైసలు పెరిగింది.

18.బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా సాగుతున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన భారత క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా కేఎల్ రాహుల్ సస్సెండయ్యారు.

19.ఆ స్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. రోహిత్ సెంచరీ 133 చేసినా 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

20. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 24 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని ఖరీదు 8 కోట్లవరకు ఉంటుంది.

21. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మధ్యాహ్నం 3.30కి రెండు సార్లు భూమి కంపించింది. జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

22.ఈనెల 16న సీఎల్పీ సమావేశం పెట్టడానికి తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో సీఎల్పీ పీసీసీ పదవుల కోసం మరోసారి రాజకీయవేడి రాజుకుంది.