Begin typing your search above and press return to search.

కేశినేని వ‌ర్సెస్ బుద్ధా వార్ వెన‌క టాప్ లీడ‌ర్‌... మ్యాట‌ర్ లీక్‌

By:  Tupaki Desk   |   16 July 2019 2:30 PM GMT
కేశినేని వ‌ర్సెస్ బుద్ధా వార్ వెన‌క టాప్ లీడ‌ర్‌... మ్యాట‌ర్ లీక్‌
X
ఏపీలో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ షాక్ నుంచి ఇంకా చంద్రబాబు కోలుకోకుండానే ఇప్పుడు సొంత పార్టీ నేతల మధ్య అంతర్గతంగా జరుగుతున్న యుద్ధాలు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతిరోజు పొద్దుపొద్దున్నే నేతల గొడవతో ఆయనకు తలబొప్పి కట్టేస్తోంది. నేత‌ల‌ను యుద్ధాలు ఆపాలని మొత్తుకుంటున్నా ఎవరు ఆయన మాట పట్టించుకున్న‌ట్టు కనపడటం లేదు. గత మూడు నాలుగు రోజులుగా తెలుగుదేశం పార్టీలో బెజవాడ నాయకులు ఎంపీ కేశినేని నాని... ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం ఓ రేంజ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఇద్దరు నేతలు ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో కించ‌ప‌రుచుకుంటూ చివరకు వాళ్ళ ఇంటి గుట్టు అంతా రట్టు చేసుకున్నారు. ఒకరేమో గుడిలో కొబ్బరి చిప్పల‌ దొంగ... సైకిల్ బెళ్లుల దొంగోడు అని విమర్శిస్తే ... మరొకరు బాలయోగి ఆస్తులు కొట్టేసిన దొంగ అని కౌంటర్ ఇచ్చుకున్నారు వీరిద్దరి మధ్య వైరానికి చాలా కారణాలే ఉన్నాయి. ముక్కు సూటిగా ఉండే కేశినేని నాని ఎన్నికల్లో గెలిచినా చంద్రబాబు ప్రయార్టీ ఇవ్వటంలేదు. బుద్ధా వెంకన్నకు... ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఎందుకు ఇవ్వడం లేదు అన్నది నాని కోపానికి కారణం.

గెలిచినా ఓడినోళ్ల‌కు ఉన్న గుర్తింపు లేన‌ప్పుడు ఈ పార్టీలో ఎందుకు ఉండాలి... నా దారి నేను చూసుకుంటా అన్న ధోరణితో ఆయన ఉన్నారు. వైసిపిలోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆల్రెడీ బిజెపి పెద్దలతో టచ్లో ఉన్నారు... నానీకి కాస్తో కూస్తో సొంత ఇమేజ్ ఉంది. అందుకే పార్టీ పై ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా విజయవాడలో గెలవగ‌లిగారు. బిజెపిలోకి డైరెక్ట్ గా వెళ్లి పోవడం కూడా ఆయనకు ఇష్టం ఉన్నట్టు లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు గీసిన గీతను కూడా దాటేసి... అవసరమైతే పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురైన తర్వాత పార్టీ మారాల‌న్న‌దే ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అందుకే తన తాజా ట్వీట్లో మీ పెంపుడు కుక్కలను కంట్రోల్‌ చేసుకో లేక పోతే నేను పార్టీకి రాజీనామా చేస్తానని కూడా నేరుగా చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు. బాబు నానిని కంట్రోల్ చేయ‌లేక అడ‌క‌త్తెర‌లో పోక చెక్క మాదిరిగా మిగిలిపోయారు.

ఈ క‌థ వెన‌క టీడీపీకి షాక్ ఇచ్చి పార్టీ మారిన మాజీ కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి డైరెక్ష‌న్ ఉన్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు అవ‌స‌ర‌మైతే వేరే రోట్లో న‌రుక్కురావాల‌ని డిసైడ్ అయిన బీజేపీ అధిష్టానం నాని కోసం ఇలాంటి కొత్త స్కెచ్ గీసిందంటున్నారు. ఇక నాని చూపులు కూడా అటువైపే ఉన్నాయ‌న్న‌ది ఓ క్లారిటీ అయితే వ‌చ్చేసింది. అందుకే గ‌తంలో కొడాలి నాని, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి పార్టీలో ఉండి బాబును ఇబ్బంది పెట్టేలా చేసిన స్ట్రాట‌జీతోనే ఇప్పుడు నాని రాజ‌కీయం చేస్తున్నారు.