Begin typing your search above and press return to search.

ఆ పార్టీ అధినేత కొడుకు ఉగ్ర‌వాది!

By:  Tupaki Desk   |   25 March 2018 5:07 AM GMT
ఆ పార్టీ అధినేత కొడుకు ఉగ్ర‌వాది!
X
ల‌క్ష‌లాది మందిని క‌దిలించే పార్టీ అధినేత కొడుకు ఉగ్ర‌వాది? అంటే న‌మ్మ‌గ‌ల‌మా? అది కూడా ఏ ఇరాకో.. ఆప్ఘ‌నిస్తాన్ లాంటి దేశంలో కాదు.. మ‌న దేశంలోనే అంటే అవాక్కు అవ్వొచ్చు. కానీ.. ఇది నిజం. ఒక రాజ‌కీయ పార్టీ అధినేత కొడుకు ఉగ్ర‌వాది అన్న విష‌యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

క‌శ్మీర్ లోని తెహ్రీక్ - ఎ- హురియ‌త్ అనే రాజ‌కీయ పార్టీకి ఛైర్మ‌న్ గా అష్ర‌ఫ్ శెరాయ్ ఇటీవ‌ల ఎన్నిక‌య్యారు. అయితే.. ఆయ‌న కుమారుడు 26 ఏళ్ల జునైద్ శుక్ర‌వారం నుంచి క‌నిపించ‌టం లేదు. తాజాగా సోష‌ల్ మీడియాలో సాగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం అత‌ను తీవ్ర‌వాదిగా మారిన‌ట్లు చెబుతున్నారు.

కుటుంబాన్ని విడిచి వెళ్లిన అత‌నిపై కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఏకే 47 తుపాకీ ప‌ట్టుకొని.. ఆయుధాలు ధ‌రించిన ఉగ్ర‌వాదిగా జునైద్ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఒక రాజ‌కీయ పార్టీ అధినేత కొడుకు ఉగ్ర‌వాదిగా మార‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.