Begin typing your search above and press return to search.

దేశంలో టాప్ త్రీ సీఎంలు వారే!

By:  Tupaki Desk   |   19 Aug 2017 10:40 AM GMT
దేశంలో టాప్ త్రీ సీఎంలు వారే!
X
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్ర‌జ‌ల‌ను బాగా ప‌రిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఎవ‌రు? ఈ ప్ర‌శ్న ఏపీలో ఎవ‌రిని అడిగిగా.. ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు లైన్‌ లోకి వ‌చ్చేసి.. ``నేనే`` అంటారు. అదే తెలంగాణ‌కు వెళితే... కేసీఆరే నెంబ‌ర్ వ‌న్ సీఎం అంటూ టీఆర్ ఎస్ నేత‌లు చెబుతారు. అయితే, దేశంలోని ప్ర‌ముఖ ప‌త్రిక ఇండియా టుడే - కార్వీ ఇన్‌ సైట్స్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఒపీనియ‌న్‌ లో పోల్‌ లో మాత్రం ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో ఒక్క‌రికి కూడా చోటు ద‌క్క‌లేదు. ఈ స‌ర్వేలో దేశంలో అత్యంత పాపుల‌ర్ సీఎం ఎవ‌రు అంటే.. ప‌శ్చిమ బంగా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అని ముక్త‌కంఠంతో జ‌నాలు జ‌వాబిచ్చార‌ట‌! అంతేకాదు, ఆమె ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ఒంటికాలిపై లేస్తున్న విష‌యంపైనా జ‌నాలు ఆమెనే స‌మ‌ర్ధించార‌ట కూడా. ఇక‌, మ‌మ‌త త‌ర్వాత స్థానం బిహార్ సీఎం నితీశ్ కుమార్ కైవ‌సం చేసుకున్నారు. అదేవిధంగా మూడో స్థానం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ సొంతం చేసుకున్నారు.

దీంతో ఇటు ఏపీ - అటు తెలంగాణ సీఎంలు టాప్ త్రీ జాబితాలో లేర‌నే విష‌యం ఖ‌రారైపోయింది. ఇక‌, ఈ స‌ర్వేలో ప్ర‌ధాని విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుత ప్ర‌ధాని మోదీని ఇప్ప‌ట్లో ఢీకొనే మొన‌గాడు ఎవ‌రూ లేర‌ని తేలిపోయింద‌ట‌. అదేస‌మ‌యంలో త‌మ భావి ప్ర‌ధానిగా కాంగ్రెస్ నేత‌లు జైకొట్టే.. రాహుల్ గాంధీకి ఈ స‌ర్వేలో కేవ‌లం 21% ఓట్లే ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ప్ర‌ధానులుగా బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ - కాంగ్రెస్ అధినేత్రి సోనియా - ఢిల్లీ సీఎం కేజ్రీలు అయితే ఎలా ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తే.. దాదాపు 13% మంది నితీశ్‌ కి - 12%మంది సోనియాకి - 7% మంది కేజ్రీకి ఓకే చెప్పార‌ట‌.

ఇక‌, బాలీవుడ్ బాద్‌ షా అమితాబ్ బ‌చ్చ‌న్ మోస్ట్ పాపుల‌ర్ హిందీ యాక్ట‌ర్‌ గా కొన‌సాగ‌డాన్ని 20% మంది ఓట‌ర్లు హ‌ర్షించారు. అదేవిధంగా దేశంలో నెంబ‌ర్-1 స్పోర్ట్స్ ప‌ర్స‌న్‌ గా విరాట్ కోహ్లీ నిలిచాడ‌ట‌. ఈయ‌న‌కు 23% ఓట్లు ప‌డ్డాయ‌ట ఈ స‌ర్వేలో. ఇక‌, టెన్సీస్ స్టార్స్‌ లో పీవీ సింధు - సానియా మీర్జా - సైనా నెహ్వాల్ తొలి ఐదుగురి జాబితాలో ఉన్నార‌ట‌.

ఇక, ఇదే స‌ర్వేలో దాదాపు స‌గానికి స‌గం మంది అంటే 49% మంది రాజ‌కీయ నేత‌లు అవినీతి ప‌రులుగా త‌మ అభిప్రాయం వెలిబుచ్చారు. వీరిత‌ర్వాత ఎవ‌రైనా అవినీతి ప‌రులుంటే.. వారు పోలీసులేన‌ని 21% మంది చెప్పార‌ట‌. దేశ అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు సంబంధించి ఉగ్ర‌వాద చొర‌బాట్ల వ‌ల్లే దేశానికి తీవ్ర ముప్పు పొంచి ఉంద‌ని 35% మంది వెల్ల‌డించార‌ట‌. అదేస‌మ‌యంలో చైనాతో ఏర్ప‌డ్డ వివాదాల‌ను సామ‌ర‌స్య పూర్వ‌కంగా ప‌రిష్కారం కావాల‌ని 23 % మంది కోరుతున్నారు. ఇక‌, 7% మంది యుద్ధం అంటే ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని చెప్పారు. మొత్తానికి స‌ర్వే ఫ‌లితాలు ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తున్నాయ‌ని నిర్వాహ‌కులు పేర్కొన్నారు.