మరో కాస్టింగ్ కౌచ్.. సెక్స్ రాకెట్ లో టాలీవుడ్

Thu Jun 14 2018 16:18:20 GMT+0530 (IST)

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న శ్రీరెడ్డికి కొండంత బలాన్ని ఇచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. తాజాగా టాలీవుడ్ నటీమణులను అమెరికా పంపి అక్కడ వ్యభిచారం చేయిస్తున్న కో ప్రొడ్యూసర్ వ్యవహారం మరోసారి టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ కేసును చేధించిన పోలీసులకు విచారణలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి.గతంలో పలు సినిమాలకు ఒక వ్యక్తి కో ప్రొడ్యూసర్ గా చేశాడు. అనంతరం భార్యతో కలిసి అమెరికా వెళ్లిపోయాడు. అక్కడే సెక్స్ రాకెట్ మొదలుపెట్టాడు. అంతగా గుర్తింపు పొందని టాలీవుడ్ హీరోయిన్లను అమెరికా రప్పించి వ్యభిచారం చేయిస్తున్నాడు. అమెరికా వ్యాప్తంగా జరిగే తెలుగు వేడుకలను టార్గెట్ చేసి అక్కడికి వ్యభిచారం కోసం కొందరు హీరోయిన్లను పంపిస్తున్నాడు. ఓ నటి పోలీసులకు పట్టుబడడంతో ఈ రాకెట్ గుట్టు రట్టయ్యింది.

వ్యభిచారం కోసం వచ్చే విటులు ఒక్కొక్కరి వద్ద నుంచి 3వేల డాలర్లు వసూలు చేస్తాడట అయన. ఇందులో హీరోయిన్ కు సగం వాటా.. ఈయనకు సగం వాటాగా వెళ్తుందట.. తాత్కాలిక పర్యటన  వీసాపై హీరోయిన్లను అమెరికాకు తీసుకొస్తాడని తేలింది. తాజాగా అలా వచ్చిన ఓ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

కింది స్థాయి నటీనటులని ఆకర్షించి ఆ వ్యక్తి  వ్యభిచారం చేయిస్తున్నాడని విచారణలో వెల్లడైంది. అమెరికా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతడి ఇంట్లో సోదాలు జరపగా అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.వారి నివాసంలో దాదాపు 70కి పైగా కండోమ్ ప్యాకెట్లు లభించడం అధికారులను నివ్వెరపాటుకు గురిచేశాయి.  అలాగే ఇప్పటివరకు వ్యభిచారంలోకి దింపిన తారల పేర్లు ఉన్న ఓ ఫైల్ కూడా లభించడంతో టాలీవుడ్ షేక్ అయ్యింది. ఆ పేర్లు బయటకు వస్తే అమెరికాలో వ్యభిచారం చేసిన హీరోయిన్లు - నటీనటుల బండారం బయటపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి టాలీవుడ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.