Begin typing your search above and press return to search.

వీడు పెద్దయ్యాక ఏం చేస్తాడో..

By:  Tupaki Desk   |   3 Oct 2015 11:47 AM GMT
వీడు పెద్దయ్యాక ఏం చేస్తాడో..
X


పిల్లలందు అల్లరి పిల్లలు వేరయా అనుకోవాలి అ చిన్నోడి సంగతి వింటే. వీడు మామూలోడు కాదు.. ఇంట్లో అమ్మానాన్నలనే కాదు.. దారినపోయేవారికి, పోలీసులకు - ఫైర్ డిపార్టుమెంటకు కూడా గుండె ఆగిపోయేంతటి టెన్షన్ పెట్టాడు. అవును... చేసింది చిన్నాచితకా పని కాదు కదా.

రష్యాలోని మాస్కోలో ఓ కుటుంబం అపార్టుమెంటులోని 8వ అంతస్తులో ఉంటోంది. వారి రెండేళ్ల అబ్బాయి రీసెంటుగా చేసిన ఘనకార్యంతో మొత్తం మాస్కో టెన్షన్ పడిపోయింది. కుర్రాడు ఆడుకుంటూ ఆడుకుంటూ కిటికీ దగ్గరకు వచ్చాడు.. కిటికీ తీసి ఉండడం... దానికి ఇనుప గ్రిల్ లేకపోవడంతో అందులోంచి బయటకు వచ్చి కిటికీకి బయట ఉన్న చిన్న పాటి చెక్క అంచుపై నిల్చున్నాడు. ఒక్క అడుగు ముందుకేసినా ఎనిమిదంతస్తుల ఎత్తు నుంచి రోడ్డుపైన పడడం ఖాయం. రోడ్డున వెళ్తున్న వారు అది చూసి కంగారు పడిపోయారు. వెంటనే పోలీసులకు, ఫైర్ డిపార్టుమెంటుకు ఫోన్ చేశారు.

ఆలోగా తల్లి కొడుకును అక్కడ చూసి ఒకటే ఏడుపు. అంతలోనే తేరుకుని మెల్లగా వెళ్లి వాడిని బుజ్జగించి పిలవడంతో మెల్లగా వాడు వెనక్కు అలాగే ఇంట్లోకి దిగిపోయాడు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే... దాదాపు 20 నిమిషాల పాటు ప్రమాదకరంగా అంత ఎత్తున నిల్చుని చిద్విలాసంగా రోడ్డుమీద వచ్చిపోయేవారిని చూసిన ఈ బుడతడు ఆ తరువాత అమ్మ పెట్టిన చీవాట్లకు మాత్రం ఏడ్చుకున్నాడు.

..ఈ సీనంతా వీడియో తీసిన ఓ వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడది హయ్యెస్ట్ షేరవుతోంది. చూసినవారంతా చెమటలు పడుతున్నా.. మొత్తం పూర్తయ్యేసరికి వీడు ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఏం చేస్తాడో అంటున్నారు.