మాల్యా కేసు.. లండన్ తీర్పు నేడే..

Mon Dec 10 2018 11:17:56 GMT+0530 (IST)

దేశంలోని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి బ్రిటన్ దేశంలో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా కేసు ఈ రోజు లండన్ కోర్టులో విచారణకు రానుంది. విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించే విషయం పై బ్రిటన్ కోర్టు ఈ సోమవారం తీర్పు వెలువరించనుంది. మల్యాను భారత్ కు అప్పగించాలన్న పిటీషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకోనుంది.లండన్ కోర్టు తీర్పు భారత్ కు అనుకూలంగా వచ్చి మాల్యాను భారత్ కు అప్పగిస్తే తీసుకోవడానికి ఇప్పటికే సీబీఐ అధికారుల బృందం సాయి మనోహర్ ఆధ్వర్యంలో లండన్ వెళ్లారు. సీబీఐ డైరెక్టర్ ఆస్తానా కేసుల్లో చిక్కుకోవడంతో సీబీఐ ఉన్నతాధికారులు సాయి మనోహర్ ను లండన్ కు పంపారు.

దేశంలోని ప్రముఖ బ్యాంకుల వద్ద దాదాపు 9వేల కోట్లు ఎగ్గొట్టి 2016లో విదేశాలకు చెక్కేసిన మాల్యా లండన్ కోర్టు తీర్పు నేపథ్యంలో తాను అసలు కడుతానని భారతీయ బ్యాంకులను కోరారు. కానీ భారత్ ఆయన పై మనీ ల్యాండరింగ్ సహా పలు కేసులు నమోదు చేయడంతో పాటు కోర్టులో పోరాడుతోంది. సోమవారం కనుక లండన్ కోర్టు మాల్యా విషయంలో తీర్పునిస్తే విజయ్ మాల్యా కథ కంచికి.. ఆయన భారత్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.