అసెంబ్లీలో ఈరోజు హైలెట్స్..

Wed Jun 12 2019 15:00:03 GMT+0530 (IST)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.  తొలుత సభ ప్రారంభం కాగానే సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రతిపక్ష పార్టీ నేతగా టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.  ఆ తర్వాత ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.  సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు తర్వాత ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమంలో ఒక్కొక్క ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.*హైలెట్స్ ఇవే..
*ముఖ్యంగా  హిందూపురం ఎమ్మెల్యే  బాలయ్య ప్రమాణం చేస్తుండగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపారు. సినిమాటిక్ డైలాగుల్లో బాలయ్య ‘నందమూరి బాలక్రిష్ణ’ అనే నేను అనగానే సభలో ఒకింత ఎక్సైట్ మెంట్ నెలకొంది.

* ప్రమాణ స్వీకారానికి ముందు అసెంబ్లీ లాబీల్లో హీరో ఎమ్మెల్యే బాలక్రిష్ణ సందడి చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు.. వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా బాలయ్య కాసేపు ముచ్చటించారు. వారితో అప్యాయంగా మాట్లాడారు. బాలయ్య అక్కడ ఉండగా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆయననను ఆప్యాయంగా పలకరించారు.

*ఇక ఒకప్పటి మిత్రులు.. ఇప్పుడు అధికార ప్రతిపక్ష సభ్యులైన మంత్రి కొడాలి నాని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కశవ్ లు చేతిలో చేయి వేసుకొని అప్యాయంగా మాట్లాడుకున్నారు.

* అసెంబ్లీలో చంద్రబాబు హుందాగా వ్యవహరించాలని.. గతంలోగా అసెంబ్లీ అప్రజాస్వామికంగా.. అనైతికంగా సాగదని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ లో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చాడు.

*ఈ అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాన్ని అంతం చేయాలని టీడీపీలాగా తాము చర్యలు తీసుకోమని ఆయన అన్నారు.

*సభలో ప్రతిపక్షాన్ని గౌరవిస్తామని.. హుందాగా సభను నడుపుతామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యావవ్ అన్నారు.

*గత ప్రభుత్వ హయాంలో తనతోపాటు మహిళ ఎమ్మెల్యేలను చంద్రబాబు టార్గెట్ చేసి గొంతునొక్కారని.. వైసీపీ ప్రభుత్వంలో మహిళలను టార్గెట్ చేయమని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు.