Begin typing your search above and press return to search.

మెమన్ ఉరిపై జస్టీస్ శ్రీకృష్ణ...

By:  Tupaki Desk   |   3 Aug 2015 6:54 AM GMT
మెమన్ ఉరిపై జస్టీస్ శ్రీకృష్ణ...
X
మెమన్ ఉరితీతకు సంబందించి రకరాకాల స్పందనలు వచ్చాయి. కొంతమంది ఉరితీతను సమర్ధిస్తే... మరి కొంతమంది పెద్దలు వ్యతిరేకించారు. మరికొంతమందైతే... అసలు ఉరితీతే రద్దుచేయాలి అనే వాదన ఎత్తుకున్నారు. ఈ క్రమంలో... 1993 ముంబై వరుసల్ పేలుళ్లకు కారణమైన మతఘర్షణలపై ఏర్పాటైన విచారణ కమిషన్ కు నేతృత్వం వహించిన జస్టీస్ బీఎన్ కృష్ణ ఈ అంశంపై స్పందించారు. దీనికి సంబందించి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు!

900మంది హత్యకు గురికాబడ్డ అల్లర్ల కేసుకు, పేలుళ్ల కేసుకు సంబందించి శ్రీకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రాదాన్యత సంతరించుకున్నాయి. ఈ క్రమంలో మరణాలను బట్టి దోషుల సంఖ్య ఉండాలన్నది తన ఉద్దేశ్యం కాదంటూనే... 900మంది హత్యకు గురైన అల్లర్ల కేసులో కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే దోషులుగా తేలారు కానీ.. 260 మంది మరణించిన పేలుళ్ల కేసులో 100కి పైగా దోషులు తేలారు అని స్పష్టం చేశారు. దీంతో కేసులు విచారణ జరుగుతున్న తీరును శ్రీకృష్ణ చెప్పేప్రయత్నం చేశారు!

ఈ లెక్కన చూసుకుంటే... అల్లర్ల కేసులో దోషులతో పోల్చితే... పేలుళ్ల కేసులో దోషులకు శిక్షలు అమలుచేసే విషయంలో ప్రభుత్వ వైఖరి పూర్తిగా ఏకపక్షంగా ఉందనే అభిప్రాయం శ్రీకృష్ణ వెళ్లడించారు! పేలుళ్ల కేసులో ప్రభుత్వానికి ఉన్న పట్టుదల, అల్లర్ల కేసులో దోషులకు శిక్షలు విదించాలనే విషయంలో మాత్రం లేకుండాపోయిందని శ్రీకృష్ణ అభిప్రాయపడ్డారు! ఈ విషయంలో నాటి కాంగ్రెస్ - ఎన్సీపీనే, నేటి బీజేపీ - శివసేన లు రెండూ ఒకేలా వ్యవహరించాయని అన్నారు!

అయితే ఉరితీతను సమర్ధిస్తున్న జస్టీస్... ఈ కేసువిషయంలో తుది తీర్పును తప్పుబట్టాల్సిన పనిలేదని, కోర్టులన్నీ సాక్ష్యాధారల లభ్యత పైనే పనిచేస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలని చెబుతూనే... అల్లర్ల కేసులో కూడా అటువంటి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ సరైన రీతిలో జరగలేదని... అల్లర్ల కేసులో దోషులకు కూడా శిక్ష పడే రోజు వస్తుందని జస్టీస్ శ్రీకృష్ణ సంచలనాత్మక కామెంట్లు చేశారు!