Begin typing your search above and press return to search.

పులి, బాతు...పందెంలో గెలిచింది ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   21 Jan 2017 9:53 AM GMT
పులి, బాతు...పందెంలో గెలిచింది ఎవ‌రో తెలుసా?
X
స్థాన‌బ‌లం అనేది ఒక‌టి ఉంటాదండీ! అంటే... ఎవ‌రు ఎక్క‌డుండాలో అక్క‌డుంటేనే బ‌లం అన్న‌మాట‌. మొస‌లి నీట్లోనే ఉండాలి. ప‌క్షి గూట్లోనే ఉండాలి. పులి అడ‌విలోనే ఉండాలి. బాతు చెరువులోనే ఉండాలి. ఈ ప్ర‌కృతి నియ‌మంలో కాస్త తేడావ‌చ్చి స్థాన‌భ్రంశం అయిందే అనుకోండీ... ఇదిగో ఈ పులికి ప‌ట్టిన గ‌తే ప‌డుతుంది! పులి... ఆ పేరులోనే ఒక గాంభీర్యం. కానీ, అడ‌విలో ఉన్న‌ప్పుడే దాని అరుపుల‌కు ఒక వేల్యూ. దాని పంజాకి ఒక పంచ్ ఉంటాది. పులి క‌న‌బ‌డితే అడ‌విలోని జంతువుల‌న్నీ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప‌టాపంచ‌లై పారిపోతాయి. కానీ, అదే పులిమారాజు... ఒక చిన్న బాతు నివ‌సించే కొల‌నులోకి వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంది..?

సింబియో వైల్డ్ లైఫ్ పార్క్ అనేది ఆస్ట్రేలియాలో ఉంది. ఆ పార్కులో కాస్త ఆక‌లి మీదున్న ఓ పులి.. బాతు వెంట‌ప‌డింది. అలా వెళ్లివెళ్లి దాని కొల‌నులోకి దిగింది. ఇదిగో... ఇక్క‌డి నుంచే దోబూచులాట మొద‌లైంది. బాతు పిల్ల‌ను పంజా విసిరి అందుకుని గుటుక్కుమ‌నిపించేద్దామ‌ని పులి అనుకున్న‌ట్టుంది. కానీ, పంజా విసిరితేగానీ అస‌లు విష‌యం తెలీలే... తాను ఉన్న‌ది బాతు పిల్ల ఇలాఖాలో అని! ఆ బుల్లి బాతు కూడా పులిని చూసి ఏమాత్రం భ‌య‌ప‌డ‌లేదు. స‌రిక‌దా... దాంతో ఆడుకోవ‌డం మొద‌లుపెట్టింది. ద‌మ్ముంటే న‌న్ను ప‌ట్టుకో అన్న‌ట్టుగా ఆ చిన్న కొల‌నులోనే ఇట్నుంచి అటూ.. అట్నుంచి ఇటూ పులిని తిప్పుకుంది.

కాసేప‌టికి పులికి కూడా రోషం వ‌చ్చిన‌ట్టుంది. మాటుగాసి మ‌రీ దానిపై దూకేది! కానీ, ఆ బాతు పిల్ల బుడుంగున నీట్లో మున‌కేసేది. ఈ దొంగాట ఇలా చాలాసేపు సాగింది. చివ‌రికి పులి అల‌సిపోయి ‘మ‌న రేంజికి ఈ చిన్న‌బాతుతో ఫైటింగ్ ఏంటీ..? పులి పులిలానే ఉండాలి. బ‌తికిపోయావ్.. పో’ అని ఓట‌మిని గ‌ర్వంతో క‌వ‌ర్ చేసుకుని గ‌ట్టెక్కేసింది. ఈ స‌ర‌దా పోరాటాన్ని ఒక టూరిస్ట్ కెమెరాలో బంధించాడు. యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఇంత‌కీ, ఈ బాతు పులీ పోరాటంలో బాతు గెలిచిందా... పులి ఓడి గెలిచిందా... మీరూ ఓసారి చూడండి మ‌రి!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/