Begin typing your search above and press return to search.

వైసీపీలో చేరే కాపు-క‌మ్మ-రెడ్డి నేత‌లు ఎవ‌రంటే

By:  Tupaki Desk   |   23 April 2018 3:30 PM GMT
వైసీపీలో చేరే కాపు-క‌మ్మ-రెడ్డి నేత‌లు ఎవ‌రంటే
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిక‌ల దూకుడుతో ముందుకు సాగుతోంది. ఓ వైపు పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాదయాత్ర‌కు విశేష స్పంద‌న తీరు శ్రేణుల‌కు ఉత్సాహాన్ని ఇస్తుండ‌గా మ‌రోవైపు పార్టీల్లో చేరిక‌ల‌కు ప్ర‌ముఖులు ముందుకు వ‌చ్చేందుకు అనేక మంది సీనియ‌ర్లు ఆస‌క్తిచూప‌డం గ‌మ‌నార్హం. వైసీపీ శ్రేణుల‌ను ఉటంకిస్తూ రాజ‌కీయ వ‌ర్గాలు చేస్తున్న ప్ర‌చారం ప్ర‌కారం ఈ వారం రోజుల్లోనే వైసీపీలో కాపు - క‌మ్మ‌ - రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన ముఖ్య‌నేత‌లు పార్టీలో చేర‌నున్నారు.

విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈనెల 25న మాజీ మంత్రి - బీజేపీ సీనియ‌ర్ నేత‌ కన్నాలక్ష్మీనారాయణ వైసీపీలో చేరనున్నారు. బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో అలక వ‌హించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తుండ‌గా..మ‌రికొందరు మాత్రం బీజేపీకి ఏపీలో భ‌వవిష్య‌త్ లేని నేప‌థ్యంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన క‌న్నా చేరితో పార్టీ బలోపేతంలో కీలక ముంద‌డుగు ప‌డిన‌ట్లేన‌ని తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా కన్నాతో పాటు వైసీపీలో చేరనున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేర‌నున్నార‌ని స‌మాచారం. నంద్యాల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాట‌సాని పోటీ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ఈ నెల 27 మ‌రో ప్ర‌ముఖ క‌మ్మ కుల‌స్తుడైన నాయ‌కుడు పార్టీలో చేరనున్నార‌ని తెలుస్తోంది. మాజీ హోం మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడైన వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ వైసీపీకి జై కొట్ట‌నున్నార‌ని స‌మాచారం. 1999లో ఆయ‌న ఎమ్మెల్యే బ‌రిలో నిల‌వ‌గా ఓట‌మి పాల‌య్యారు. 2014లో ఆయ‌న టీడీపీలో చేరిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డికి ఆయ‌న స‌న్నిహితుడని తెలుస్తోంది. రాబోయే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు మైల‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం లేదా విజ‌య‌వాడ పార్ల‌మెంటు టికెట్‌ను కేటాయించ‌నున్నార‌ని స‌మాచారం.