Begin typing your search above and press return to search.

రాక్షసులే బెటర్ అని వెళ్లిపోతున్నారట

By:  Tupaki Desk   |   14 Feb 2016 5:08 AM GMT
రాక్షసులే బెటర్ అని వెళ్లిపోతున్నారట
X
ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక.. ఉన్న ఊరినే కాదు.. దేశాన్ని వదిలి పెట్టి భయంతో పక్క దేశాలకు వలస పోయిన వేలాది సిరియా.. ఇరాక్ ప్రజలకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఉగ్రవాదుల కారణంగా.. వారు పెట్టే హింసను భరించలేక దేశం విడిచి వెళ్లి పోయిన వారిని యూరప్ కు చెందిన పలు దేశాలు పంచుకోవటం తెలిసిందే.

అలా పంచుకున్న దేశాల్లో ఫిన్లాండ్ ఒకటి. అయితే.. ఈ దేశానికి కేటాయించిన ఇరాక్.. సిరియా దేశాలకు చెందిన ప్రజలు ఇప్పుడు ఆ దేశంలో ఉండే కన్నా.. మాతృదేశానికి వెళ్లిపోవటానికే మొగ్గు చూపిస్తుండటం గమనార్హం. పరాయి దేశంలో ప్రకృతి విసిరే సవాళ్లు తట్టుకోవటం కన్నా.. సొంత దేశంలో ఉగ్రవాదులే బెటర్ అన్న ఆలోచనకు రావటం విశేషం. పొట్ట చేత పట్టుకొని.. దేశం విడిచి.. ఫిన్లాండ్ లో అడుగు పెట్టిన వారిలో అత్యధికులు తిరిగి వెళ్లిపోతామని వెల్లడించటం విశేషం.

పిన్లాండ్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసిన వారిలో అత్యధికులు ఇప్పుడు తమ దరఖాస్తుల్ని వెనక్కి తీసేసుకుంటున్నారు. ఆ దేశంలోని వాతావరణ పరిస్థితులే దీనికి కారణంగా చెబుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు అలవాటు పడిన సిరియా.. ఇరాకీయులు.. అందుకు భిన్నమైన వాతావరణంతో పాటు.. భారీగా కురిసే మంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని.. ఈ చలిని తాము తట్టుకోలేమని.. తిరిగి వెళ్లిపోతున్నామని చెబుతున్నారట. మైనస్ డిగ్రీల్లో ఉండే చలి వాతావరణాన్ని తాము తట్టుకోలేమని.. దీంతో పోలిస్తే.. తమ దేశాల్లోని రాక్షసులే బెటర్ అని భావిస్తున్నారట.