Begin typing your search above and press return to search.

‘తోట’కు అవమానం..చంద్రబాబు ఇలా చేస్తాడా?

By:  Tupaki Desk   |   23 July 2018 2:25 PM GMT
‘తోట’కు అవమానం..చంద్రబాబు ఇలా చేస్తాడా?
X
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నరసింహం అలకబూనారని వార్తలొస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై అసహనంతో ఉన్నాడని లీకులు వెలువడుతున్నాయి. 2014 ఎన్నికల్లో తోట నరసింహం టీడీపీ తరఫున కాకినాడ ఎంపీ బరిలో నిలిచి గెలిచారు. ఈయన పార్టీలో సీనియర్ కావడం.. రాజకీయాల్లో మంచి పట్టు ఉండడంతో చంద్రబాబు సముచిత గౌరవం కల్పించాడు. ఏకంగా పార్లమెంటులో టీడీపీ పక్ష నాయకుడిగా తోటను నియమించారు. అంటే టీడీపీ ఎంపీలు అందరూ తోట కనుసన్నల్లోనే నడవాలన్నమాట.. పార్లమెంటులో కూడా ఏదైనా టీడీపీ తరఫున చెప్పాలనుకుంటే నేరుగా తోటనే సంప్రదించాలి..స్పీకర్ కూడా టీడీపీ తరఫున తోటకే ఆహ్వానం అందిస్తారు. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే..

రాజకీయాల్లో అవసరార్థం వాడేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరని చాలా సార్లు రుజువైంది. ఈ విషయాన్ని టీడీపీ నేతలే కథలు కథలుగా చెబుతారు.. ఇప్పుడూ తోట నరసింహంను పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు అవమానించేసరికి ఆయన కొద్దిరోజులుగా సైలెంట్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

తాజాగా పార్లమెంటులో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం సందర్భంగా పార్లమెంటు పక్ష నాయకుడైన తోటనరసింహం హవా ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆయన పార్లమెంటు పక్ష నాయకుడన్న విషయాన్ని కూడా అందరూ మరిచిపోయారు..

చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అవిశ్వాసం ఎపిసోడ్ లో తోటను పక్కన పెట్టేశారు. అవిశ్వాసం తీర్మానం పెట్టే అవకాశం ఇవ్వలేదు. చర్చలో కనీసం ఆయనకు ఒక్కసారి కూడా మాట్లాడే చాన్స్ దక్కలేదు. లోక్ సభలో పార్టీ నాయకుడిగా ఉన్న తోట తో పోలిస్తే గల్లా జయదేవ్ - కేశినేని నాని - రామ్మోమన్ నాయుడులు తొలిసారి ఎంపీలుగా గెలిచినవారే.. నర్సింహం మాత్రం ఉమ్మడి ఏపీలో మంత్రిగా చేశారు. ఎంతో సీనియర్. ఆయనకు కనీసం నోటుసు ఇచ్చే చాన్స్ కూడా చంద్రబాబు ఇవ్వకపోయేసరికి అలక వహించారట.. పార్టీ తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వరా అంటూ కుమిలిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎంతైనా బాబు అనుగ్రహం కావాలంటే పెట్టి పుట్టాలని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు..