Begin typing your search above and press return to search.

ఇండియా గెలుపునకు.. ఆసీస్ ఓటమికి కారణమిదే..

By:  Tupaki Desk   |   10 Jun 2019 4:31 AM GMT
ఇండియా గెలుపునకు.. ఆసీస్ ఓటమికి కారణమిదే..
X
ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్.. రెండు అగ్ర శ్రేణి.. ప్రపంచంలోనే బలమైన జట్లు.. హోరీ హోరీ తలపడితే ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ సహజం. అన్నట్టే స్టార్ హీరో మహేష్ బాబు నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వరకు అందరూ లండన్ వెళ్లి ఓవల్ మైదానంలో వాలిపోయారు. భారత్ దంచికొట్టింది. ధావన్ సెంచరీ చేయడం.. కోహ్లీ, రోహిత్ రఫ్పాడించడంతో స్కోరు 352 పరుగులు చేసింది.

అయితే ప్రత్యర్థి ఆస్ట్రేలియా వదిలిపెట్టలేదు. అచ్చం ఇండియా ఆడినట్టే మొదట స్లోగా మొదలు పెట్టింది. ఆ తర్వాత స్పీడందుకుంది. ముఖ్యంగా సీనియర్ వెటరన్ లు వార్నర్, స్మిత్ లు క్రీజులో ఉండగా ఆస్ట్రేలియా గెలుస్తుందనే అనిపించింది. అసీస్ ఒకానొక దశలో 39.3 ఓవర్లలో 238/3 వికెట్లతో గెలుపునకు దగ్గరైంది. దంచికొడితే గెలిచేదే.. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది..

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో మోస్తారుగా బౌలింగ్ చేసిన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ తన సీనియారిటీ అంతా ఉపయోగించి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. గెలిపించడానికి రెడీ అయిన స్మిత్ ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఇదే మ్యాచ్ లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఇక ఆ తర్వాత మరో రెండు బంతులకే భీకర ఆల్ రౌంటర్ స్టాయినస్ ను భువనేశ్వర్ బౌల్డ్ చేశాడు.

ధవన్ సెంచరీ కొట్టినా దాన్ని భారత్ కాపాడుకుందంటే అదంతా బౌలర్ల మహిమే.. ముఖ్యంగా భువనేశ్వర్ కీలక ఓవర్ లో స్మిత్ ను, స్టాయినిస్ కు ఒకే సారి ఔట్ చేయడంతో భారత్ విజయానికి దగ్గరచేసింది. ఆస్ట్రేలియా ఓటమికి, భారత్ విజయానికి మధ్య ఈ భువనేశ్వర్ ఓవర్ కీలకంగా పనిచేసింది.