బూతులోనూ మేడిన్ ఇండియానే ఇష్టమట!

Wed Jan 11 2017 00:00:01 GMT+0530 (IST)

ఇదో ఆసక్తికరమైన నిజం. మేడిన్ ఇండియాకు క్రేజ్ ఉండటంలో వింత లేదు కానీ ఇలాంటి వాటిలో కూడా అనేదే వింత కావచ్చు. బూతు చిత్రాలైనా.. దేశీయ బూతు చిత్రాలనే భారతీయులు అధికంగా ఇష్టపడుతున్నారట! సెర్చ్ లో ఇండియన్ అనే పదంతో అత్యధికులు వీడియోల కోసం వెతికారట! ఈ బూతు సైట్‌ను సందర్శించే 18 ఏండ్ల నుంచి 24 ఏండ్ల మధ్య వయస్కుల్లో ఇతర దేశాలతో పోల్చితే భారతీయులే ఎక్కువట! పోర్న్ హబ్ అనే వెబ్ సైట్ ఈ వివరాలు వెల్లడించింది. ప్రత్యేకించి సన్నీ లియోన్ కోసం అత్యధికులు పోర్న్ సైట్ ను చూశారని పేర్కొంది.

ఫోర్న్ హబ్ ఈ వెబ్ సైట్ ను సందర్శిస్తున్న భారతీయుల్లో 30శాతం మంది మహిళలు కూడా ఉన్నారని తెలిపింది. గత ఏడాదిలో తమ వెబ్ సైట్ ను సందర్శించినవారి గణాంకాలను విశ్లేషిస్తూ పోర్న్‌హబ్ ఒక సవివరమైన నివేదికను తయారు చేసింది. దీని ప్రకారం.. ఈ వెబ్‌సైట్ ద్వారా బూతు చిత్రాలు చూసేవారి సంఖ్యలో మొత్తం ప్రపంచ దేశాల్లో భారత్ నాలుగవ అతిపెద్ద దేశంగా ఉన్నది. అయితే అంతకు ముందు సంవత్సరం భారత్ మూడో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది ఒక స్థానం తగ్గడం విశేషం. ఈ ఏడాది అమెరికా - బ్రిటన్ - కెనడాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మేడిన్ ఇండియా కాన్సెప్ట్ భారతీయులకు బాగా నచ్చినట్టుంది.. అందుకే ఇండియన్ అనే పదాలతో సెర్చ్ చేసిన వారి సంఖ్య భారతీయ సందర్శకుల్లో అధికంగా ఉందని వ్యాఖ్యలు కూడా ఈ నివేదికలో చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/