Begin typing your search above and press return to search.

ప్రమాణ స్వీకారంలో హైలెట్స్ ఇవే..

By:  Tupaki Desk   |   8 Jun 2019 9:26 AM GMT
ప్రమాణ స్వీకారంలో హైలెట్స్ ఇవే..
X
ఏపీ సీఎం జగన్ కేబినెట్ కొలువుదీరింది. మొత్తం 25మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ఈ మధ్యాహ్నం వారితో ప్రమాణ స్వీకారోత్సవం ముగించారు. ఈ మంత్రి వర్గ విస్తరణలో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

*హైలెట్స్ ఇదే..
* మొదట వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారాన్ని జగన్ మొదలు పెట్టించారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ మంత్రిగా మొదట ప్రమాణం చేశారు. అనంతపురం జిల్లా మంత్రి శంకరనారాయణతో ప్రమాణం ముగిసింది.

* మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరూ జగన్ ను ఆలింగనం చేసుకున్నారు. కొందరు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. సురేష్, అనిల్, పేర్ని నాని, పెద్దిరెడ్డిలు ఎమోషనల్ అయ్యారు.

*ఇద్దరు మంత్రులు ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమలుపు సురేష్, నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతంరెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. మిగిలిన 23మంది ప్రమాణం చేశారు.

*అందరికంటే ఎక్కువగా మాస్ లీడర్లుగా వైసీపీలో ఫేమస్ అయ్యి అశేష అభిమానులను సంపాదించుకున్న కృష్ణ జిల్లాకు చెందిన కొడాలి నాని, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ల ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానులు ఈలలు, కేకలు. నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల సందడి బాగా కనిపించింది. బాలినేని, పెద్దిరెడ్డి మద్దతు దారులు కూడా వచ్చి సందడి చేశారు.