Begin typing your search above and press return to search.

ఇండియన్ శ్రీమంతురాళ్లు

By:  Tupaki Desk   |   7 Oct 2015 9:54 AM GMT
ఇండియన్ శ్రీమంతురాళ్లు
X
పురుషులు, స్త్రీలు అన్న భేదం చాలావరకు తగ్గుతుండడం శుభపరిణామం. మెదడు ఉపయోగించి చేసే పనుల్లోనైనా... శారీరక దారుఢ్యంతో చేయాల్సిన పనులైనా దేనిలోనూ మహిళలకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. సంపాదనలోనైనా, కీర్తి కిరీటాలు అందుకోవడంలోనైనా కూడా అంతే స్థాయిలో ముందు నిలుస్తున్నారు. సంపద సృష్టించడం... సంపద కలిగి ఉండడంతో మహిళలు పురుషులకు ధీటుగా నిలుస్తున్నారు. మన దేశంలో వేల కోట్లకు పడగలెత్తిన శ్రీమంతురాళ్లు ఉన్నారు. ఆ శ్రీమంతురాళ్ల సంపద ఎంతెంతో వింటే 'మీలో ఎవరు కోటీశ్వరులు" అని అడిగే పనే ఉండదు... అందరూ కోటీశ్వరులే అనుకోవాల్సిందే. వారెవరో తెలుసుకుందా..

సావిత్రి జిందాల్‌: ఇండియాలో అత్యంత ధనిక మహిళ ఈమె. 49,3600 కోట్ల రూపాయల(7.6 బిలియన్ డాలర్లు) సంపద ఈమె సొంతం. జిందాల్‌ స్టీల్‌ మరియు పవర్‌ లిమిటెడ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ పర్సన్‌గా సావిత్రి జిందాల్‌ ఉన్నారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీలో ఈమె కీలక నేత కూడా. రాజకీయాలు, వ్యాపారం రెండింటిలోనూ రాణిస్తున్న సావిత్రి భారతదేశంలోకెల్లా శ్రీమంతురాలు.

ఇందు జైన్‌: సావిత్రి జిందాల్ తరువాత స్థానం ఈమెదే. 2.6 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఆమె సొంతం. భారతీయ కరెన్సీలో 16887 కోట్ల సంపద ఈమెకు ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక, ఇతర సంస్థలకు మూల సంస్థ అయిన బెన్నెట్ కోల్ మన్ కు ఈమె అధిపతి..

అనూ ఆగా: పేరొందిన వ్యాపారవేత్త మాత్రమే కాకుండా సామాజిక కార్యకర్తగా కూడా అనూ అగా సుపరిచితురాలు. రూ.9677 కోట్ల(1.49 బిలియన్‌ డాలర్ల)తో ఈ 73 ఏళ్ల వృద్ధురాలు సంపద పరంగా 'పవర్‌ఫుల్‌ విమెన్‌' అనిపించుకున్నారు. థర్మాక్స్‌ లిమిటెడ్‌కు ఈమె మాజీ ఛైర్‌ పర్సన్‌.

కిరణ్‌ మజుందార్‌ షా : బయోకాన్‌ లిమిటెడ్‌ చైర్‌ పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా. ఐఐఎం బెంగళూరు చైర్‌ పర్సన్‌ కూడా అయిన కిరణ్‌ మజుందార్‌ షా ఆస్తుల మొత్తం 1.2 బిలియన్‌ డాలర్లు. అంటే సుమారు 7494 కోట్లు..

శోభనా భార్తియా: హిందూస్తాన్‌ టైమ్స్‌ గ్రూప్‌ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌, చైర్‌ పర్సన్‌ అయిన శోభనా భార్తియా 2013లో 'ఆసియా మోస్ట్‌ పవర్‌ఫుల్‌ బిజినెస్‌ విమెన్‌'గా ఎంపికయ్యారు. రాజ్యసభ ఎంపీగానూ పనిచేశారు. భార్తియా ఆస్తుల విలువ 655 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు. అంటే సుమారు 4254 కోట్ల రూపాయలు.