Begin typing your search above and press return to search.

ఇవే టాప్ టెన్ ఎయిర్ పోర్టులు

By:  Tupaki Desk   |   20 March 2017 9:49 AM GMT
ఇవే టాప్ టెన్ ఎయిర్ పోర్టులు
X
ఇండియాలోనూ ఇప్పుడిప్పుడే విమాన సర్వీసులు పెరుగుతున్నాయి. ఇతర దేశాల్లో అయితే, విమానయానం చాలా కామన్. మనకంటే విమానాశ్రయాలూ ఎక్కువ.. సర్వీసులూ ఎక్కువే. ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే ప్రయాణం వాయుమార్గం పడుతోంది. ఇదంతా ఎలా ఉన్నా ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం ఏదీ అంటే సింగపూర్ లోని చాంగీ ఎయిర్ పోర్టు పేరే వినిపిస్తోంది కొన్నేళ్లుగా. తాజాగా 2017లోనూ చాంగీ ఎయిర్ పోర్టుకే టాప్ ప్లేస్ దక్కింది. స్కైట్రాక్స్‌ వరల్డ్‌ ఎయిర్‌ పోర్ట్ అవార్డ్స్‌ జాబితాలో చాంగీ విమానాశ్రయం వరుసగా ఐదోసారి టాప్‌ లో నిలవడం గమనార్హం.

లక్షలాది మంది విమాన ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి రూపొందించిన ఈ జాబితాను ఇటీవల ఆమ్‌ స్టర్‌ డ్యాంలో విడుదల చేశారు. ఈ జాబితాలో టోక్యో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ రెండోస్థానంలో నిలిచింది. కాగా, అమెరికా విమానాశ్రయాల్లో సిన్సినాటి విమానాశ్రయం అత్యుత్తమంగా 26వ ర్యాంకులో నిలిచింది. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అందించే సేవలు, పరిశుభ్రత, అహారం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని స్కైట్రాక్స్‌ జాబితా రూపొందించారు.

ఇదీ టాప్ టెన్ లిస్టు..

1. సింగపూర్‌ చాంగీ విమానాశ్రయం

2. టోక్యో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌(జపాన్‌)

3. ఇంచియాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌(సియోల్‌ - దక్షిణ కొరియా)

4. మ్యూనిచ్‌ ఎయిర్‌ పోర్ట్‌(జర్మనీ)

5. హాంకాంగ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌

6. హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌(దోహా - ఖతార్‌)

7. చుబు సెంట్రెయిర్‌ నగొయా(జపాన్‌)

8. జ్యూరిచ్‌ ఎయిర్‌ పోర్ట్‌(స్విట్జర్లాండ్‌)

9. లండన్‌ హీత్రూ విమానాశ్రయం

10. ఫ్రాంక్‌ ఫర్డ్‌ ఎయిర్‌ పోర్ట్‌(జర్మనీ)

కాగా ఇటీవల ఎయిర్ పోర్ట్సు కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రమాణాల ప్రకారం మాత్రం మన శంషాబాద్ ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్‌పోర్టు టాప్ ప్లేస్ లో ఉంది. రెండు వారాల కిందట శంషాబాద్ కు ఈ ఫస్టు ర్యాంకు వచ్చింది. ప్రపంచంలోనే అత్యుత్త‌మ స‌ర్వీసును అందిస్తోన్న విమానాశ్రయంగా ఆ విమానాశ్ర‌యానికి గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌పంచంలోని మొత్తం 300కి పైగా విమానాశ్రయాలను ప‌రిశీలించిన ఎయిర్‌ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) శంషాబాద్ విమానాశ్ర‌యాన్నే అత్యుత్త‌మ సేవ‌లందించే ఎయిర్‌ పోర్టుగా గుర్తించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/