ఆ పత్రిక ఓనర్ రేపటి టార్గెట్ గవర్నర్!

Sat Apr 20 2019 21:59:26 GMT+0530 (IST)

వీకెండ్ కామెంట్ అంటూ అదేదో పలుకు అంటూ.. తనకు తోచినట్టుగా రాసుకుని పోవడం ఒక పత్రికాధినేతకు అలవాటే! ఒక రాజకీయ పార్టీకి తోక పత్రికగా పేరు పొందిన మీడియా సంస్థకు యజమాని అయిన ఆయన ప్రతి వారం తన రాతలతో తనకు కావాల్సిన వాళ్ల మీద అభిమానాన్ని తనకు నచ్చని వాళ్ల మీద అక్కసును వెల్లగక్కుతూ ఉంటారు. ఇది కొత్త ఏమీ కాదు. ఆయనకు అలవాటే.ఆయన వాదనల్లో రాతల్లో తర్కం ఉండదు. కేవలం తనకు నచ్చని వారి మీద పడి రక్కేసేలా రాస్తూ ఉంటారాయన! ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరేమన్నా ఆయన వెనక్కు తగ్గే టైపు కాదు. తను అభిమానించే తనకు బాగా కావాల్సిన పార్టీ అధినేత అవసరాలకు తగ్గట్టుగా ఈయన వీకెండ్ కామెంట్లు కొనసాగుతూ ఉంటాయి.

తనకు కావాల్సిన పార్టీ అధినేత ఏం చేసినా.. అది రైటే అని ఆయన ప్రత్యర్థులు ఏం చేసినా తప్పే అని తనకు సన్నిహిత నేత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా వారి మీద దుమ్మెత్తి పోస్తూ ఆయన కామెంటరీ చెబుతూ ఉంటారు.

ఆయన ఎన్ని రాసిన ఎంత రాసినా.. అది తన ఫేవరెట్ పొలిటీషియన్ ను సమర్థించడమే పని. అందుకు గానూ అధికారికంగా అనధికారికంగా బోలెడంత లబ్ధి కలుగుతూ ఉంటుందంటారు. అందుకే ఆయన అంతగా చించేసుకుంటూ ఉంటారనేది అంతటా వినిపించే మాట!

మరి ఈ పరంపరలో వీకెండ్..  రేపు.. ఆదివారాన ఆ పత్రికలో టార్గెట్ గవర్నర్ గా ఆయన వీకెండ్ కామెంట్ సాగబోతోంది. గవర్నర్ నరసింహన్ అంటే ఏపీ ముఖ్య నేతకు చాలా కాలం నుంచి పడటం లేదు. ఇక అధికారం పూర్తి అవుతున్న దశలో కూడా గవర్నర్ మీద అదే కోపమే ఉంది. అలా ఆయనకు ఉన్న కోపాన్ని ఈ పత్రికాధినేత రేపటి తన రాతల్లో చూపబోతూ ఉన్నారని ముందస్తుగానే చెప్పడం జరుగుతోందిక్కడ.

గవర్నర్ మీద దుమ్మెత్తి పోస్తూ ఆయన తీరును తప్పు పడుతూ ఆయన పై తన తీర్పులను ఇస్తూ.. రేపు ఆ వీకెండ్ కామెంటరేటర్ రెచ్చిపోతున్నారు చూసుకోండి!