Begin typing your search above and press return to search.

తెల్లారి 5 గంటలకు తారాగఢ్ రోడ్ల మీద నడిచారు

By:  Tupaki Desk   |   29 July 2015 4:35 AM GMT
తెల్లారి 5 గంటలకు తారాగఢ్ రోడ్ల మీద నడిచారు
X
పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ మీద దాడి జరిపిన ఉగ్రవాదులకు సంబంధించిన ప్రాధమిక సమాచారం బయటకు వచ్చేసింది. ఉగ్రదాడిలో పాల్గొన్న వారంతా పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా తేలింది. పోలీసుల కాల్పుల్లో మరణించిన ముగ్గురు తీవ్రవాదులు ముస్లింలుగా గుర్తించారు.

బస్సు మీద.. పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. అంతర్జాతీయ సరిహద్దులైన ధుస్సి బంద్ మార్గం ద్వారా భారత్ లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత సరిహద్దు దాటిన ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించిన వెంటనే.. తమ వెంట ఉన్న జీపీఎస్ పరికరాల్ని ఆన్ చేశారు. బమియాల్ నుంచి అమృత్ సర్ .. జమ్మూ జాతీయ రహదారికి నడుచుకుంటూ వెళ్లిన వారు.. రైల్వే ట్రాక్ పై బాంబులు పెట్టారు. అనంతరం దీనానగర్ కు చేరుకున్నారు.

ఒక హోటల్ యజమానిని బెదిరించి.. అతని కారును స్వాధీనం చేసుకున్న వారు.. అంతకు ముందు.. దీనానగర్ లోని రోడ్ల మీద నడిచినట్లు గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 4.55గంటల సమయంలో ఆర్మీ దుస్తులు.. ఏకే 47 రైఫిల్స్ చేతబట్టి.. తారాగఢ్ (దీనానగర్ కు దగ్గర్లోని) రోడ్ల మీద తిరిగారు. వీరి ఆచూకీని ఒక వాణిజ్య సంస్థ సీసీ టీవీ ఫుటేజ్ లో లభ్యమైంది. వారు రోడ్డు మీద నడుస్తున్న 14 సెకండ్ల వీడియో ఫుటేజ్ లభించింది.

అంతేకాదు.. వీరు అమృత్ సర్.. పఠాన్ కోట్ రైల్వే ట్రాక్ లపై బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. ఒక్కో బాంబు కిలోగ్రామ్ చొప్పున మొత్తం ఐదు కిలోల వరకూ ఉన్నాయి. వీటిని ఆర్డీఎక్స్ తో తయారు చేసినట్లుగా తేల్చారు. భారత్ లోకి అక్రమంగా చొరబడి.. ఉగ్రదాడికి పాల్పిడిన తీవ్రవాదులంతా తమ ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు.. తమ లోదుస్తుల లోగోలు కూడా చెరిపి వేసి ఉంచటం చూసినప్పుడు వారు పక్కా ప్లాన్ తో భారత్ లోకి ప్రవేశించినట్లు అర్థమవుతోంది.