Begin typing your search above and press return to search.

అమెరికా ప్రతినిధుల సభలోకి మన పద్మ

By:  Tupaki Desk   |   9 Nov 2018 9:46 AM GMT
అమెరికా ప్రతినిధుల సభలోకి మన పద్మ
X
అమెరికా ఎన్నికల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగు వారు సత్తా చాటుతున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణకు చెందిన పద్మ కుప్ప డెమోక్రటిక్ అభ్యర్థిగా మిచిగాన్ రాష్ట్రంలో పోటీచేసి విజయం సాధించారు.

1965 అక్టోబర్ 8న భిలాయ్ లో ఓ హిందూ సంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఈమె మైసూరులో కొంతకాలం పెరిగారు. నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్ - స్టోనీ బ్రూక్ నగరాల్లో పెరిగారు. 15 ఏళ్ల వయసులో భారత్ వచ్చి విద్యాభ్యాసం చేశారు. వరంగల్ లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ ఈసీ) ప్రస్తుతం నిట్ నుంచి 1984-85లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు. తర్వాత అమెరికా వెళ్లిపోయారు. బాల్యం నుంచి పలు ప్రాంతాల్లో తిరిగిన ఈమెకు ప్రస్తుత భర్త - కుమారుడు - కుమార్తె ఉన్నారు.

అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో మహిళల హవా కొనసాగింది. మొత్తం 98మంది గెలవడం విశేషం. ఇందులో పద్మతోపాటు ఇండో అమెరికన్లు కూడా ఎన్నికయ్యారు. వీరిలో నీమా కులకర్ణి - మజ్ తబా - రామ్ విల్లివాలమ్ - అమీష్ షా - కెవిన్ థామస్ డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక జోష్ కౌల్ అనే ఇండియన్ ఏకంగా రాష్ట్ర అటార్నీ జనరల్ గా గెలిచి రెండో ఇండో అమెరికన్ గా రికార్డు సాధించారు.