Begin typing your search above and press return to search.

ధనిక రాష్ట్రంలో ఈ పన్ను దోపిడేంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   27 Feb 2017 6:01 AM GMT
ధనిక రాష్ట్రంలో ఈ పన్ను దోపిడేంది కేసీఆర్?
X
గొప్పలు చెప్పుకోవటానికి బాగానే ఉంటుంది. కానీ.. ఆ గొప్పలకు తగ్గట్లే అన్ని ఉండాలి. దేశంలోనే ధనిక రాష్ట్రంగా చెప్పే తెలంగాణ రాష్ట్రానికి మరో మరకలాంటి ముచ్చట బయటకు వచ్చింది. ధనిక రాష్ట్రమని గొప్పగా చెప్పుకున్నందుకు.. ప్రజలకు భారీగానే పన్ను పోటు పడుతున్న కొత్త విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రజలు సుఖంగా..సంతోషంగా ఉండాలంటే.. ప్రశాంతమైన జీవనం.. అంతకు మించి పన్ను భారం పెద్దగా లేకుండా. . ఆదాయం సరిపోయేంతగా ఉంటే అంతకు మించి కావాల్సిందేమీ ఉండదు.

కానీ.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పన్నుల భారం ఎక్కువన్న కొత్త విషయం బయటకు వచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలోనే ఎక్కువన్న విషయం బయటకు వచ్చింది. పన్నుల రాబడిని.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వివిధ రాష్ట్రాలు నిర్దేశించుకునే పన్నుల్ని లెక్క చూసినప్పుడు.. దేశంలోనే అత్యంత ఎక్కువ పన్ను భారం తెలంగాణలో ఉందన్న విషయం బయటకు వచ్చింది. ఇక.. దేశంలోనే అతి తక్కువ పన్నుల భారం.. దీదీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో అన్న విషయం తేలింది.

తెలంగాణలో ప్రతి వంద రూపాయిల ఆర్థిక కార్యకలాపాల్లో 8.2 రూపాయిల్ని పన్నుగా వసూలు చేస్తారని.. అదే పశ్చిమబెంగాల్ లో ఇది కేవలం 5.1 రూపాయి మాత్రమేనని తేలింది. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పన్నుల శాతం ప్రతి వందలో 7.7 రూపాయిలుగా తేలింది. జీడీఎస్ డీపీ.. పన్నుల వసూళ్ల నిష్పత్తి తెలంగాణ తర్వాత ఛత్తీస్ గఢ్ ఉండగా.. మూడోస్థానంలో ఏపీ నిలిచింది. తర్వాతి స్థానాల్లో జమ్ముకశ్మీర్.. కర్ణాటక.. రాజస్థాన్.. హర్యానా.. పంజాబ్.. గుజరాత్.. తదితర రాష్ట్రాలు ఉండటం గమనార్హం.

ధనిక రాష్ట్రమన్న ట్యాగ్ లైన్ బాగానే ఉన్నా.. అందుకు తగ్గట్లుగా పన్ను పోటు ఎక్కువగా ఉన్న విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెడితే బాగుండు. భారీగా వచ్చే పన్ను ఆదాయం నేపథ్యంలో.. వీలైనంత తక్కువ భారం ప్రజల మీద పడేలా చేస్తే.. కేసీఆర్ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయనటంలోసందేహం లేదు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పన్ను భారం ఎక్కువన్న ట్యాగ్ లైన్ కంటే కూడా.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ప్రజలపై పన్ను భారం చాలా తక్కువన్న ట్యాగ్ లైన్ వినేందుకు బాగుండటమే కాదు..అలాంటి చేతల్లో చేసి చూపిస్తే కేసీఆర్ ను ప్రజలు ఎంతకూ మర్చిపోరనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/