Begin typing your search above and press return to search.

పెళ్లిళ్లో బ‌రాత్ వ‌ద్దు...కొత్త‌ ఆంక్ష‌లు

By:  Tupaki Desk   |   19 Jan 2018 11:30 PM GMT
పెళ్లిళ్లో బ‌రాత్ వ‌ద్దు...కొత్త‌ ఆంక్ష‌లు
X
తెలంగాణ వ‌క్ఫ్ బోర్డ్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఒక బరాత్‌ లో కాల్పులు - మరో బరాత్‌ లో తల్వార్‌ క్రీడ కారణంగా ఒకరు మృతి చెందారు. రాత్రి 12 దాటితే ఫంక్షన్‌ హాల్‌ ను మూసివేసే విధంగా చర్యలు చేపట్టనుంది. నిఖా జరిపించే ఖాజీలు - మతపెద్దలతోపాటు పోలీసు ఉన్నతాధికారులతో 23న వక్ఫ్‌ బోర్డు పాలకమండలి సమావేశం కానుంది. ఈ సంద‌ర్భంగా బ‌రాత్ బ్యాన్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

స‌హ‌జంగా ముస్లింల పెళ్లిళ్లలో బరాత్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వీటిని కట్టడి చేసేందుకు తెలంగాణ వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. దీనిలో భాగంగా నిఖా ప్రక్రియ రాత్రి తొమ్మిది గంటలలోపు పూర్తి చేసే విధంగా వక్ఫ్‌బోర్డు కార్యాచరణ రూపొందిస్తోంది. నిఖాకు సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8 గంటల వరకు సమయపాలన నిర్దేశించనుంది. ఈ మేరకు పెళ్లిళ్లు జరిపించే ఖాజీలకు ఆదేశాలు జారీ చేయాలని యోచిస్తోంది. అంతేకాకుండా పెళ్లి విందులో ఆడంబరాలకు వెళ్లకుండా బిర్యానీ - స్వీట్‌ తో సరిపెట్టే విధంగా కట్టడి చేయాలని వక్ఫ్‌ బోర్డు భావిస్తోంది. పెళ్లి విందంటే లక్షల రూపాయలతో కూడుకున్న ఖర్చు. పలు వెరైటీల బిర్యానీ - మటన్ - చికెన్ - స్వీట్ - సూప్‌ డిష్‌ లు వడ్డించడం సర్వసాధారణమైంది. దీంతో ఆయా కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి.దీంతో పెళ్లి వేడుకల సమయపాలన - వివాహ విందుపై సూచనలు - సలహాలు సేకరించాలని నిర్ణయించింది.

ఇప్పటికే వక్ఫ్‌ బోర్డు పాతబస్తీలోని పోలీసులతో సమావేశమయ్యారు. బరాత్‌ లో కత్తులు - డ్రమ్ముల శబ్దాలను నిషేధించారు. మరోవైపు బెంగళూరు - పుణే - మహారాష్ట్రల్లో పెళ్లి ఫంక్షన్‌ హాల్‌ లో రాత్రి 11.30 తర్వాత లైట్లు ఆర్పివేస్తారు. హైదరాబాద్‌ లో మాత్రం తెల్లవారుజాము వరకు విందు భోజనాలు - ఇతర కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని దీనిని మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నారు.