Begin typing your search above and press return to search.

సినిమా చూసుడు క్లాస్టీ ఎఫైర్ బాస్‌

By:  Tupaki Desk   |   27 Jun 2017 5:09 AM GMT
సినిమా చూసుడు క్లాస్టీ ఎఫైర్ బాస్‌
X
భారాల జాబితాలో సినిమా టిక్కెట్టు చేరిపోయింది. రోజులు గ‌డుస్తున్న కొద్దీ అంత‌కంత‌కూ పెరుగుతున్న ధ‌ర‌ల జాబితాలోకి సినిమా టిక్కెట్లు చేరిపోయాయి. తాజాగా సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల్ని పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల్ని తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు విడుద‌ల చేసింది.

ఈ నెల 23న ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో నంబ‌రు 75 ప్ర‌కారం జీహెచ్ ఎంసీ ప‌రిధిలోని ఏసీ థియేట‌ర్లో బాల్క‌నీ టిక్కెట్టు ధ‌ర రూ.120గా.. కింది క్లాస్ ధ‌ర రూ.40 వ‌ర‌కూ పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా పెంచిన థియేట‌ర్ టిక్కెట్ల ధ‌ర‌లు క‌నిష్ఠంగా రూ.10.. గ‌రిష్ఠంగా 20 వ‌ర‌కూ పెరిగాయి.

నాన్ ఏసీ థియేట‌ర్ బాల్క‌నీ రూ.60గా.. లోయ‌ర్ క్లాస్ రూ.20గా నిర్ణయించారు. మున్సిపాలిటీల్లోని ఏసీ థియేట‌ర్ బాల్క‌నీలో రూ.80.. లోయ‌ర్ క్లాస్ రూ.30 కాగా.. నాన్ ఏసీ థియేట‌ర్ల‌లో బాల్క‌నీ టిక్కెట్ రూ.60.. లోయ‌ర్ క్లాస్ రూ.20గా నిర్ణ‌యించారు.

అదే స‌మ‌యంలో న‌గ‌ర‌.. గ్రామ పంచాయితీల్లోని ఏసీ థియేట‌ర్ల‌లో బాల్క‌నీ టిక్కెట్ ధ‌ర రూ.70 కాగా.. లోయ‌ర్ క్లాస్ ధ‌ర రూ.20గా డిసైడ్ చేశారు. ప‌నిలో ప‌నిగా థియేట‌ర్ల ఆధునీకీక‌ర‌ణ ఖ‌ర్చుల కింద రూ.2 నుంచి రూ.7 వ‌ర‌కూ పెంచుకునే వీలు క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇక‌.. ఈ మ‌ధ్య అంత‌కంత‌కూ పెరుగుతున్న మ‌ల్టీఫ్లెక్సుల్లో ఒక్కో టిక్కెటుపై రూ.50 పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఆయా శ్రేణుల‌ను అనుస‌రించి టిక్కెట్ల ధ‌ర‌ల్ని రూ.200 నుంచి రూ.300 మ‌ధ్య ఉండాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. తెర ముందు ఉండే రెండు ఫంక్తుల సీట్ల‌కు మాత్రం గ‌రిష్ఠ ధ‌ర‌లో 20 శాతం కంటే త‌క్కువ‌గా వ‌సూలు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/