Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఆర్నెల్లు ఆర్టీసీ సమ్మెపై బ్యాన్

By:  Tupaki Desk   |   2 Dec 2015 4:43 AM GMT
తెలంగాణలో ఆర్నెల్లు ఆర్టీసీ సమ్మెపై బ్యాన్
X
ఉద్యమ పార్టీ ప్రభుత్వంగా బాధ్యతలు చేపడితే.. కొన్ని అంశాల విషయంలో గత ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరిస్తారన్న అభిప్రాయం ఉంటుంది. కానీ.. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ అధికారపక్షం తీసుకునే నిర్ణయాలు కాస్తంత భిన్నంగా ఉండటం విశేషం.

ఉద్యమాలు.. సమ్మెలన్నవే టీఆర్ ఎస్ పార్టీకి ఊపిరి ఇవ్వటమే కాదు.. అధికార పీఠం మీద కూర్చునేలా చేశాయి. మరి.. అవే ఉద్యమాలు.. సమ్మెల్ని తమ ప్రభుత్వ హయాంలో చేయకూడదంటూ నిర్ణయం తీసుకోవటం ఏమిటో అర్థం కాని పరిస్థితి. తాము ఉద్యమాలు చేస్తున్నప్పుడు.. ప్రభుత్వాలు ఎప్పుడైనా సమ్మెల మీద బ్యాన్ పెడితే.. తీవ్రంగా నిరసన తెలిపిన టీఆర్ ఎస్.. తాను అధికారంలో ఉన్నప్పుడు సమ్మెల మీద బ్యాన్ పెట్టటం కాస్తంత ఆశ్చర్యానికి గురి చేసే అంశంగా చెప్పాలి.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను చూస్తే.. తెలంగాణ ఆర్టీసీలో ఆరు నెలల పాటు సమ్మెలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్మా నిబంధనల మేరకు సమ్మెల్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అత్యవసర ప్రజా సేవలైన ఆర్టీసీ లో ఉద్యోగులు ఆందోళనలకు ఉపక్రమిస్తే.. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతారంటూ ప్రభుత్వం చెబుతోంది. మరి.. ఉద్యమ పార్టీగా ఉద్యమాలు చేసినప్పుడు.. సమ్మె చేయాలని పిలుపు నిచ్చినప్పుడు.. ఇదే ప్రజలు గుర్తుకు రాలేదా..?