Begin typing your search above and press return to search.

టీ సర్కార్ ఆఫర్:100 బ్రాండ్ల ఫారిన్ లిక్కర్ తెస్తే..

By:  Tupaki Desk   |   4 Oct 2015 6:14 AM GMT
టీ సర్కార్ ఆఫర్:100 బ్రాండ్ల ఫారిన్ లిక్కర్ తెస్తే..
X
ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేందుకు ఏ మాత్రం వెరుపులేని తెలంగాణ సర్కారు తాజాగా సరికొత్త ఆలోచన చేస్తోంది. హైదరాబాద్ కు వచ్చే విదేశీయులకు వంద విదేశీ బ్రాండ్ల మధ్యం కూడా దొరకటం లేదట. విదేశీ బ్రాండ్లకు చెందిన మద్యం ఏమేమి దొరుకుతున్నాయో లెక్క తేలిస్తే.. పెద్దగా లేవని తేల్చారు. నిజానికి.. ఈ మధ్య జరిగిన ఎక్సైజ్ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా.. ఫారిన్ బ్రాండ్ లిక్కర్ గురించి ప్రస్తావిస్తూ.. విదేశీ అతిధులు హైదరాబాద్ కు వస్తే ఫారిన్ బ్రాండ్స్ పెద్దగా దొరకటం లేదన్న మాటను తెరపైకి తెచ్చారు.

దీంతో.. సర్వే నిర్వహించిన అధికారులు.. ఫారిన్ బ్రాండ్లు పెద్దగా లభించటం లేదన్న విషయాన్ని గుర్తించి.. ఆ కొరత తీర్చేందుకు నడుం బిగించారు. వంద బ్రాండ్ల విదేశీ మద్యాన్ని తీసుకొచ్చే సత్తా ఉన్న వారికి రెండేళ్ల కాల పరిమితితో ఉన్న లిక్కర్ బొటిక్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఫారిన్ లిక్కన్ బ్రాండ్లు తెచ్చే వారికి.. భారీ బిజినెస్ అవకాశం ఎదురు చూస్తుందన్న మాట. మరి.. ఈ కొత్త లైసెన్సుల కోసం ఎంత పోటీ ఉంటుందో..?