Begin typing your search above and press return to search.

తెలంగాణలో గోవా వ్యూహం..వర్క్ అవుట్ అవుతుందా?

By:  Tupaki Desk   |   10 Dec 2018 8:25 AM GMT
తెలంగాణలో గోవా వ్యూహం..వర్క్ అవుట్ అవుతుందా?
X
తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే పరిస్థితి ఎలా మారుతుందనేది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక - గోవా రాష్ట్రాల మాదిరిగానే గవర్నర్ నిర్ణయం కీలకం కానుందా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాలతోపాటు సామాన్యుల్లో ఆసక్తి రేపుతుంది.

కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తమకే మెజార్టీ స్థానాలు వస్తాయని పైకి చెబుతున్నా అంతిమ ఫలితంపై నేతల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాకూటమిగా బరిలో నిలిచిన తమ కూటమికి వచ్చే స్థానాల ఆధారంగానే ప్రభుత్వాన్ని పిలువాలని - సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటూ కర్ణాటకలో మెలిక పెట్టినట్టు పెట్టవద్దని గవర్నర్ ను కోరేందుకు కాంగ్రెస్, సహా కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

ఇంతకముందు గోవా - కర్ణాటకలోనూ బీజీపీ గవర్నర్లను అడ్డంపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో గోవాలో పార్టీ వ్యూహం వర్కవుట్ కాగా కర్ణాటకలో బెడిసి కొట్టింది. ఇక తెలంగాణలోనూ ప్రజాకూటమికి మ్యాజిక్ ఫిగర్ దాటినా మొత్తంగా అత్యధిక స్థానాలు టీఆర్ ఎస్ కు వస్తే ఆ పార్టీకి ముందే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తే అంతే సంగతులు అని గ్రహించిన కూటమి నేతలు ముందస్తుగా గవర్నర్ కలిసేయత్నం చేస్తున్నారు.

గోవా - కర్ణాటకలో ఎలాగైనా బీజేపీని గట్టేక్కించేందుకు ఆయా రాష్ట్రాల గవర్నర్ చూపిన అత్యుత్సాహంతో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మళ్లీ అది రిపీట్ కాకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటుంది. బీజేపీ వ్యూహాల నేపథ్యంలో కూటమి మేల్కొన్నప్పటికీ గవర్నర్ నిర్ణయం మాత్రం బీజేపీ అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. కాగా బీజేపీ కూడా అవసరమైతే టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

ఇంతకీ ఓటరు ఎవరి వైపు మెగ్గు చూపాడు? విస్పష్టమైన తీర్పును ఇచ్చాడా లేదా కలగాపులగం రాజకీయ వైపు తెలంగాణ ఓటరు మొగ్గు చూపాడా అనేది ఫలితాల వెల్లడి తర్వాతే తెలుస్తుంది. ఫలితాల వెల్లడి తర్వాత గవర్నర్ రాజకీయం ఎంత కీలకానుంది అనే తేటతెల్లం కానుంది. ఏదిఏమైనా మంగళవారం వెల్లడికానున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఈ ఉత్కంఠకు తెరపడటం ఖాయంగా కనిపిస్తుంది.