Begin typing your search above and press return to search.

కమలదళానికి ఇక్కడోనీతి.. అక్కడోనీతి!

By:  Tupaki Desk   |   14 Jan 2018 12:10 PM GMT
కమలదళానికి ఇక్కడోనీతి.. అక్కడోనీతి!
X
తనదాకా వస్తే భిన్నంగా వ్యవహరించే తీరు రాజకీయ నాయకుల్లో కొత్త కాదు. ఇప్పుడు తెలంగాణలోని భాజపా నాయకులు కూడా ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. కీలకమైన ఒక బిల్లు విషయంలో దానిని సభలో ప్రవేశపెట్టడానికి ముందే.. అన్ని పార్టీల ప్రతినిధులకు పంపి.. అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని.. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని.. డిమాడ్ చేస్తున్న తెలంగాణ భాజపా.. ఇదే నీతిని కేంద్రంనలోని తమ పార్టీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తూ ఉంటే మారు మాట్లాడడం లేదు. అందుకే చూడబోతే వీరు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నట్లుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం చాలా కీలకంగా పంచాయతీ రాజ్ చట్టాన్ని తయారు చేసింది. రాష్ర్టంలోని సర్పంచులకు ఈ చట్టం ఎక్కువ అధికారాలను కట్టబెడుతుంది. ఎక్కువ బాధ్యతలను కూడా కట్టబెడుతుంది. పంచాయతీల అధికారాలు పెరుగుతాయి.. అని, నిధుల వినిమయంలో వారి పాత్ర కూడా పెరుగుతుందని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. అయితే విపక్షాలు మాత్రం సహజంగానే ఈ బిల్లు మీద అనేక సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటిదాకా ఈ మూడున్నరేళ్లలో పంచాయతీల వికాసానికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా.. కేంద్రం పంచాయతీల ద్వారా వెచ్చించడానికి ఇస్తున్న నిధులను కూడా రాష్ట్రప్రభుత్వమే తీసేసుకుంటూ .. ఇప్పుడు కొత్త చట్టం తెస్తునదనేది భాజపా ఆరోపణ. దీనికోసం ముందు అఖిలపక్షం పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ కాంగ్రెస్ నుంచి కూడా బలంగా వినిపిస్తోంది.

అయితే పోల్చిచూసినప్పుడు.. ఇదే తరహా పరిస్థితి ఎదురైన... తలాక్ బిల్లు విషయంలో కేంద్రలోని భాజపా మాత్రం అన్ని పార్టీల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా మొండిపట్టు పట్టడం గమనించాలని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే లోక్ సభలో బిల్లును ఆమోదింపజేసి, రాజ్యసభలో బిల్లును తొ లుత సెలక్ట్ పార్లమెంటరీ కమిటీకి పంపండి అంటేనే ఒప్పుకోకుండా.. భాజపా భీష్మించుకుంటున్నదనే విమర్శలు అనేక వర్గాలనుంచి వస్తున్నాయి. దేశానికే ఎంతో కీలకమైన తలాక్ బిల్లు విషయంలో లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండగా.. అన్న వర్గా లఅభిప్రాయం తీసుకోవడానికి, పార్లమెంటరీ కి పంపడానికే ససేమిరా అంటున్న భాజపా.. తెలంగాణలో పంచాయతీ రాజ్ చట్టానికి కూడా అఖిలపక్షం కావాలని కోరడం ద్వంద్వనీతి కాక మరేమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.