Begin typing your search above and press return to search.

టీ బీజేపీకి అమిత్‌ షా పెట్టిన ప‌రీక్ష ఇది

By:  Tupaki Desk   |   22 Jun 2018 10:30 AM GMT
టీ బీజేపీకి అమిత్‌ షా పెట్టిన ప‌రీక్ష ఇది
X
తెలంగాణ బీజేపీ..మ‌రోసారి కీల‌క ప‌రీక్ష ఎదుర్కోనుంది. రాష్ట్రంలో అధికారం కోసం క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని...సీఎం పీఠంపై ఉన్న కేసీఆర్‌ను కుర్చీ నుంచి దింప‌డ‌మే త‌మ‌ ల‌క్ష్య‌మ‌ని తెలంగాణ బీజేపీ ప్ర‌తిసారి ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ప్ప‌టికీ అవి అమ‌లవుతున్న‌వి త‌క్కువే. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే కీల‌క ప‌రిణామం చోటుచేసుకున్నాయి. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా త్వ‌ర‌లో రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తార‌ని తెలంగాణ బీజేపీ ప్ర‌క‌టించింది. అయితే ఈ టూర్ హ‌ఠాత్తుగా ర‌ద్దు అయింది. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన కీలక ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ జన చైతన్య యాత్ర పేరుతో శ‌నివారం నుంచి రాష్ట్రంలో పర్యటించబోతున్నామ‌న్నారు. ఈ యాత్ర తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందని బీజేపీ అధ్య‌క్షుడు వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ లో కూడా అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. బషీర్‌ భాగ్ అమ్మవారి సన్నిధానంలో పూజల అనంతరం యాత్ర ప్రారంభించి యాదాద్రిలో మొదటి సభ ఉంటుందన్నారు. జులై 12 అమిత్‌ షా పర్యటన ఉంటుందని లక్ష్మ‌ణ్ తెలిపారు.

ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ప్రజల ముందు కాంగ్రెస్ ను - టీఆర్ ఎస్ ను దోషిగా నిలబెడతామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా టీఆర్ ఎస్-బీజేపీ రహస్య ఒప్పందం జరిగిందని విషప్రచారం చేస్తోంద‌ని, తామేం చేసిన బహిరంగంగానే చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అయితే అమిత్‌ షా టూర్ తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు ప‌రీక్ష అని అంటున్నారు. ఇటీవ‌లి కాలంలో ప‌లువురు నేత‌లు బీజేపీకి గుడ్ బై చెప్తుండ‌టం - మ‌రోవైపు కొత్త‌గా నాయ‌కులు చేర‌ని కార‌ణాల వ‌ల్లే అమిత్ షా జూన్ 22వ తేదీ ప‌ర్య‌ట‌న ర‌ద్దైంద‌నేది పార్టీ వ‌ర్గాల్లో టాక్‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తిరిగి రాష్ట్రంలో ప‌ర్య‌టించే నాటికి అయినా...పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ఢిల్లీ పెద్ద‌లు సూచించినట్లు స‌మాచారం. తాజాగా షా టూర్ నేప‌థ్యంలో రాష్ట్రవ్యాప్త ప‌ర్య‌ట‌న వెనుక మ‌త‌ల‌బు ఇదేనంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ అగ్ర‌నేత ప‌ర్య‌ట‌న పార్టీకి బ‌లం చేకూర్చే అంశం కంటే వారికి ప‌రీక్ష‌గా మారే ప‌రిణామాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్తున్నారు.