Begin typing your search above and press return to search.

నోటీసులు తిప్పి పంపిన టీ స్పీక‌ర్‌

By:  Tupaki Desk   |   4 Aug 2015 12:12 PM GMT
నోటీసులు తిప్పి పంపిన టీ స్పీక‌ర్‌
X
తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే విష‌యంలో టీడీపీ.. కాంగ్రెస్‌.. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలు.. హైకోర్టులో వ్యాజ్యం వేసిన సంగ‌తి తెలిసిందే. ఒక పార్టీ నుంచి గెలిచి.. అధికార‌ప‌క్షంలోకి జంప్ అయిన ప‌ది మంది వ‌ర‌కు ఎమ్మెల్యేల అన‌ర్హ‌త విష‌యంపై వారు హైకోర్టును ఆశ్ర‌యించారు.

దీనిపై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ ఉదంతంపై తెలంగాణ స్పీక‌ర్ తీసుకున్న చ‌ర్య‌ల గురించి.. హైకోర్టు ఆయ‌న‌కు నోటీసులు పంపించింది. ఇలా పార్టీ మారిన నేత‌ల్లో టీటీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యే గా ఎంపికైన త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ను తెలంగాణ అధికార‌ప‌క్షం మంత్రిగా చేయ‌టం.. ఆయ‌న రాజీనామా చేసిన‌ప్ప‌టికీ స్పీక‌ర్ దానిని ఆమోదించ‌క‌పోవ‌టం లాంటి అంశాల నేప‌థ్యంలో.. పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు ఎప్పుడు తీసుకుంటారంటూ వివిధ పార్టీల నేత‌లు కోర్టుకు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా వీరిపై ఎప్ప‌టిలోపు విచార‌ణను స్పీక‌ర్ పూర్తి చేస్తార‌న్న విష‌యాన్ని తెలుసుకోవ‌టం కోసం హైకోర్టు నోటీసులు పంపింది. అయితే.. హైకోర్టు నుంచి వ‌చ్చిన నోటీసును ఆయ‌న స్వీక‌రించ‌కుండా.. తిప్పి పంపిన‌ట్లుగా చెబుతున్నారు. స్పీక‌ర్‌ కు పోస్టల్ శాఖ ద్వారా.. రిజిష్ట‌ర్ పోస్ట్ పంపార‌ని.. అయితే.. అదిస్పీక‌ర్ వ‌ద్ద‌కు చేరి.. ఆయ‌న దాన్ని స్వీక‌రించేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌టంతో దాన్ని వెన‌క్కి తిప్పి పంపిన‌ట్లుగా చెబుతున్నారు. తాజా ప‌రిణామంతో ఈ కేసు విష‌య‌మై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ గురువారం ఉంది.