Begin typing your search above and press return to search.

బాబు కంటే కేసీఆర్ ఒక్కరోజు ఎక్కువే

By:  Tupaki Desk   |   2 Sep 2015 6:14 PM GMT
బాబు కంటే కేసీఆర్ ఒక్కరోజు ఎక్కువే
X
ప్రతి విషయంలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి పోటీ లక్షణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కువే. విషయం ఏదైనా సరే.. చంద్రబాబు కంటే ఒక అడుగు ముందుండాలన్న భావన ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్లే ఆయన అవసరం లేకున్నా పోటీ పడుతుంటారు. ఈ వైఖరితోనే.. ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న జీతం కంటే ఒక శాతం ఎక్కువ ఇస్తున్నట్లు ప్రకటించి అందరిని విస్మయానికి గురి చేశారు.

డిమాండ్ చేస్తున్న దాని కంటే అధికంగా జీతం వరం కేసీఆర్ ప్రకటించాలన్న నిర్ణయం వెనుక.. అంతకు ముందే జీతాల పెంపు విషయంలో కార్మికులు కోరుకున్నంత మొత్తాన్ని ఇవ్వటమే.

పేద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబే అంత పెద్ద వరం ఇస్తే.. తనలాంటి సంపన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆర్టీసీ కార్మికుల జీతం డిమాండ్ లో వారు కోరుకున్న మొత్తం కేంట ఎక్కువ ఇవ్వటం ద్వారా తానెంత ఈగోయిస్ట్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఇలా.. చాలానే విషయాల్లోనూ ఏపీ కంటే ముందుండాలన్న తపన కేసీఆర్ చేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇలా.. తనలోని ఈగోను అవసరానికి తగ్గట్లుగా ప్రదర్శించే కేసీఆర్.. తాజాగా అసెంబ్లీ సమావేశాల విషయంలో ప్రదర్శించటం గమనార్హం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులకు పరిమితం చేయటం తెలిసిందే. ఏపీ విపక్షం గట్టిగా నిలదీసినా.. ఐదు రోజులకు మించి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం సాధ్యం కాదని తేల్చేశారు. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సమావేశాలను ఆరో రోజుల పాటు నిర్వహిస్తామని వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులకు పరిమితమైతే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం.. ఆరు రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పటం ద్వారా బాబు కంటే తాను ఒక రోజు అధికంగా అసెంబ్లీని నిర్వహిస్తున్న క్రెడిట్ కొట్టేసుకున్నారని చెప్పకతప్పదు.