Begin typing your search above and press return to search.

బెంగ‌ళూరు టెకీ చివ‌రి వ‌ర్కింగ్ డే వీడియో వైర‌ల్‌

By:  Tupaki Desk   |   15 Jun 2018 2:04 PM GMT
బెంగ‌ళూరు టెకీ చివ‌రి వ‌ర్కింగ్ డే వీడియో వైర‌ల్‌
X
సోష‌ల్ మీడియాలో ఓ టెకీ వీడియో వైర‌ల్ అయింది. ఏకంగా...బీజేపీకి చెందిన సుప్ర‌సిద్ధ నేత‌, ఫైర్ బ్రీఆండ్ నాయుకుడు అయిన ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆ వీడియోను పోస్ట్ చేసేవ‌ర‌కు ఆ వీడియో చేరిపోయింది. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముందంటే... రూపేశ్ కుమార్ వర్మ అనే టెకీ ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం కూడా లక్షల్లో ఉంది అయినా జీవితంలో ఏదో వెలితి.. తీరని ఆవేదన.. ఆవేశం.. ఆగ్రహం.దీనికితోడు బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ రద్దీ.. ఆఫీసులోనే 10 గంటలు గొడ్డు చాకిరీతోపాటు.. ఆఫీస్ టూ హౌస్ జర్నీకి మరో 4 గంటల సమయం.. మొత్తంగా 16 గంటలు బయటే.. కొంపలో ఉండేది చాలా తక్కువ సమయం.. దీంతో తొక్కలో ఉద్యోగం అనుకొని వెంటనే రాజీనామా చేసేశాడు.

ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంత‌రం స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయటానికి రూపేశ్ రెడీ అయ్యాడు. అదే స‌మ‌యంలో బెంగళూరులో సిటీలో ట్రాఫిక్ రద్దీపై మాత్రం తన అక్కసు వెళ్లగక్కాలని నిర్ణయించాడు. అనుకున్నదే తడవుగా.. ఆఫీస్ చివరి వర్కింగ్ డే రోజున తన కారు, బైక్, క్యాబ్ కాదని.. ఏకంగా గుర్రం ఎక్కి వచ్చాడు. ఇంటి నుంచి బాగా కష్టపడి, ట్రాఫిక్ రద్దీని తట్టుకుని గుర్రంపై ఆఫీసుకు వచ్చాడు. దానికి ఓ బోర్డు కూడా తగిలించాడు. ``లాస్ట్ వర్కింగ్ డే ఏజ్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్`` అని రాసిన బోర్డు తగిలించాడు. ఆఫీస్ పార్కింగ్ లోకి వచ్చి గుర్రాన్ని కట్టేశాడు. ఈ వీడియోనే..ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈ ప‌రిణామంపై రూపేశ్ స్పందిస్తూ....బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు నానాటికీ పెరిగిపోతున్నాయని, పరాష్కార మార్గాలను వెదకడంలో వెనుకబడ్డామని ఆవేదన చెందుతోన్న రూపేశ్‌.. తానీ పనిచేసింది సెన్సెషన్‌ కోసం కాదని, అయినాసరే పాపులర్‌ అయిపోవడంతో థ్రిల్‌ అయ్యానని చెప్పాడు. దేశంలో కోకొల్లలు సమస్యలు ఉన్నాయని.. వాటిలో ఒక్కటి పరిష్కరించినా నాకు ఆనందమే అంటున్నాడు. ఉద్యోగం.. ఉద్యోగం అంటూ బాధపడొద్దని.. ధైర్యంతో కంపెనీలే పెట్టండని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను కోరుతున్నాడు. ప్రతి ఒక్కరికీ యూనియన్స్ ఉన్నప్పుడు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుకు ఎందుకు సంఘాలు లేవని ప్రశ్నిస్తున్నాడు.