టెకీ కామక్రోదం..చివరకు కటకటాలకు

Sat Aug 24 2019 11:00:30 GMT+0530 (IST)

దేశంలో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టీసీఎస్ లో జాబ్. లక్షల జీతం.. పైగా సీనియర్ - సిన్సియర్ ఉద్యోగి. అంతా బుద్దిమంతుడు అనుకున్నాడు. అది ఆఫీస్ వరకే. ఇంటికెళితే ఇతడి కామ క్రోదాలు పురివిప్పుతాయి..  ఇంత బుద్దిమంతుడు ఇలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. పైకి ప్రశాంత మూర్తిగా ఉండే ఇతడు లోపల మాత్రం కామంతో రగిలిపోయే పిశాచిలా ఉన్నాడు. తన టెకీ తెలివితేటలతో 600మంది యువతుల నగ్న చిత్రాలను తెలివిగా సేకరించాడు. అయితే పాపం పండిన రోజు రానే వచ్చింది. ఓ యువతి ధైర్యం చేసి ఇతడి బాగోతాన్ని బయటపెట్టడంతో మనోడి నగ్న చిత్రాల సేకరణ బాగోతం బయటపడింది.చెన్నై టీసీఎస్ క్యాంపస్ లో చెన్నైకే చెందిన ప్రదీప్ (33) సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. నిరుద్యోగ అందమైన అమ్మాయిలకు వల వేసేందుకు అమ్మాయి పేరుతో ఓ నకిలీ  వాట్సాప్ ఐడీని సృష్టించాడు. హైదరాబాద్ లోని ప్రముఖ రాడిసన్ హోటల్ లో రిసెప్షెనిస్టుల ఉద్యోగాలు ఉన్నాయంటూ క్వికర్ డాట్ కామ్ లో ప్రకటన విడుదల చేశాడు. దానికి ఎంతో మంది అందమైన యువతులు ఇతడిని సంప్రదించాడు.  అక్కడే ఇతడి వికృత చేష్టను బయటపెట్టాడు.

తనను సంప్రదించిన వారికి వాట్సాప్ లో మా లేడీ మేనేజర్ ఇంటర్వ్యూ చేస్తుందని నమ్మించాడు. లేడీ పేరుతో తనే వాట్సాప్ నంబర్ ను క్రియేట్ చేసి రిసెప్షెనిస్టులకు మంచి ఫిజిక్ ఉండాలంటూ నగ్న చిత్రాలను - వీడియోలను అడిగాడు. లక్షల జీతంతో ఉద్యోగం ఆశ.. పైగా లేడీ మేనేజర్ అడుగుతోందని అందరూ నగ్న చిత్రాలు - వీడియోలు పంపారు..

అయితే హైదరాబాద్ మియాపూర్ కు చెందిన ఓయువతి మాత్రం ఇలానే ఫొటోలు వీడియోలు పంపి మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.వారు ప్రదీప్ ను గుర్తించి చెన్నై పోలీసులను సంప్రదించి అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తీసుకున్నారు. ఇతడి ల్యాప్ టాప్ లో ఏకంగా 16 రాష్ట్రాలకు చెందిన 600 మంది యువతుల 2000 నగ్న చిత్రాలు - వీడియోలు ఉండడం చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఇతడి కామ క్రోదాలు చూసి షాక్ తిన్నారు. ఇలా ఉద్యోగాల పేరుతో యువతుల అసహాయతను ఆసరాగా తీసుకొని ఎంజాయ్ చేస్తున్న టెకీ చివరకు కటకటాల పాలయ్యాడు.