Begin typing your search above and press return to search.

'గుర్తు' ఉన్నప్పుడే లేదు...ఇప్పుడు గుర్తిస్తారా

By:  Tupaki Desk   |   16 Dec 2018 3:30 PM GMT
గుర్తు ఉన్నప్పుడే లేదు...ఇప్పుడు గుర్తిస్తారా
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందస్తు ఎన్నికలు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తున్నాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందు సరే ఎన్నికలు పూర్తేన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించేందుకు అన్నీ పార్టీలు ఏకం అయ్యాయి. ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - సీపీఐ ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగాయి. అయితే ఈ పార్టీలన్నీ తీవ్ర పరాభవంతో ఓటమి పాలైయ్యాయి. కూటమిగా ఏర్పడినా ఈ పార్టీలకు ఎవరు గుర్తు వారిదే...... దీంతో తెలంగాణ ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై అన్ని పార్టీలు విడిగానే పోటి చేసినట్లు అయ్యింది. తెలంగాణ ఫలితాలు వెలువడిన వెంటనే ఇక్కడ పంచాయతీ ఎన్నికలకు తెర లేచింది. జనవరి 16వ తేదిలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలంటూ ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంచాయతీ ఎన్నికలకు రంగం సమాయత్తం అయ్యింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా పంచాయతీ ఎన్నికలలో విజయం తమదే అంటూ ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది. ఇటీవలే ముగిసిన ముందస్తు ఎన్నికలలో కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయిన కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి పోటీ ఇస్తుందని చర్చ జరుగుతోంది. శాసనసభ ఎన్నికలకు - పంచాయితి ఎన్నికలకు మధ్య చాల తేడా ఉంటుంది. పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్దులు ఏ పార్టీకి చెందిన వారు కాదు.వారు పోటీ చేసే గుర్తులు కూడ ఆయా పార్టీలకు చెందినవి కాదు. ఒక్కొక్కరికి ఒక్కో గుర్తులు కేటాయిస్తుంది ఎన్నికలు సంఘం. దీంతో తమ అభ్యర్దులు ఎవరో ఇతర అభ్యర్దులు ఎవరో తెలుసుకోవడం కష్టం. వివిధ రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలలో వివిధ అభ్యర్దులకు అనుకూలంగా ప్రచారం చేస్తారు. ఇది మాత్రమే ఏ అభ్యర్దికి ఏ పార్టీ మద్దతు ఇస్తుందో తెలియజేస్తుంది. గత తెలంగాణ ఎన్నికలలో హస్తం గుర్తుపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్దులనే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. ఈ పంచాయతీ ఎన్నికలలో హస్తం గుర్తు లేని..... ఏ గుర్తో తెలియని అభ్యర్దులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తే ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని పరిశీలకులు అంటున్నారు. దీంతో చేతి గుర్తు ఉన్న శాసనసభ ఎన్నికలలోనే బొక్కబోర్ల పడ్డ కాంగ్రెస్ పార్టీ ఏ గుర్తు లేని పంచాయతీ ఎన్నికలలో ఎలా విజయం సాధిస్తుందని అంటున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నిక తర్వాత రెండో భారీ పరాజయానికి పంచాయతీ ఎన్నికలే వేదికని పరిశీలకులు అంటున్నారు.