Begin typing your search above and press return to search.

‘పెటా’పై వార్ డిక్లేర్ చేసిన తమిళలోకం

By:  Tupaki Desk   |   19 Jan 2017 5:00 AM GMT
‘పెటా’పై వార్ డిక్లేర్ చేసిన తమిళలోకం
X
దేశంలోని మిగిలిన ప్రాంతాలకు తమిళులకు ఓ భిన్నమైన సారూప్యత ఉంది. మామూలుగా ఉన్నట్లే ఉంటారు. కానీ.. వారికి సంబంధించిన ఏ చిన్న విషయంలో తేడా వచ్చినా సరే.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఒక్కసారిగా కదనరంగంలోకి దిగుతారు. అది కావేరీ జలాలు కావొచ్చు.. జల్లికట్టు కావొచ్చు. సంక్రాంతి సందర్భంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టుపై జంతు సంరక్షణే తమ ధ్యేయంగా చెప్పుకునే పెటా సంస్థ తీవ్రంగా వ్యతిరేకించటం.. ఆ సంస్థ పుణ్యమా అని.. జల్లికట్టుపై నిషేదం విధించేలా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవటంపై తమిళులు భగ్గుమంటున్నారు.

తమ సంప్రదాయాలపై పరిమితులు పెడతారా? అంటూ వారు విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా చిన్నా.. పెద్దా.. సామాన్యుడు.. ప్రముఖుడు అన్న తేడా లేకుండా విరుచుకుపడుతున్నారు. జల్లికట్టుపై పరిమితులు విధించటంపై తీవ్ర నిరసనను వ్యక్తంచేయటమే కాదు.. యావత్ తమిళనాడు మొత్తం రగిలిపోయేలా చేస్తోంది.

జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు విధించిన బ్యాన్ ను ఎత్తివేయాలంటూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. జల్లికట్టుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ తమిళులు పలువురు ఆత్మహత్యలకు ప్రయత్నించారు. మరికొన్ని చోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించటం.. వాటిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జికి దిగటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా తయారు కావటమే కాదు.. సుప్రీంకోర్టు మీదా.. కేంద్రం తీరు మీదా వారు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

జల్లికట్టుపై విధించిన బ్యాన్ ను ఎత్తివేయాలని కోరుతూ చెన్నై మెరీనా బీచ్ తీరంలో తమిళులు నిర్వహించిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతను పెంచాయి. ఆందోళనల్ని విరమించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం చేసిన ప్రకటపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. జల్లికట్టుపై సుప్రీంతీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అన్నీ వర్గాలు ఏకమయ్యాయి. ఈ ఆందోళనలకు తమిళ చిత్రపరిశ్రమ సంఘీభావం వ్యక్తం చేసింది.

సినీతారలు లారెన్స్.. రెమో నటుడు శివకార్తికేయన్ లాంటి వారు మెరీనా బీచ్ లో జరుగుతున్న ఆందోళనలో పాల్గొనటమే కాదు.. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు భోజనం.. మంచినీరు అందించటం గమనార్హం. ఇక.. నటి సమంత జల్లికట్టుకు మద్దుతుగా ట్వీట్ చేశారు. ఇక.. గురువారం జల్లికట్టుకు మద్దతుగా టీవీ.. సినిమా కళాకారులు ఎవరూ షూటింగ్ లలో పాల్గొనకూడదన్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఇలా.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా యావత్ తమిళనాడు జల్లికట్టుపై విధించిన నిషేధంపై మండిపడటమే కాదు.. దీనంతటికి కారణమైన పెటా సంస్థపై వార్ డిక్లేర్ చేశారు. ఇప్పుడువారి ప్రధాన డిమాండ్లు రెండే రెండుగా చెప్పాలి. ఒకటి జల్లికట్టుపై విధించిన బ్యాన్ ను ఎత్తేయటం.. రెండోది.. పెటా సంస్థను నిషేధించటం. మరి.. దీనిపై కేంద్రం.. సుప్రీంకోర్టులు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/