Begin typing your search above and press return to search.

‘‘అమ్మ’’ ఫ్యూచర్ చెప్పే డేట్ వచ్చేసింది?

By:  Tupaki Desk   |   12 Feb 2016 4:20 AM GMT
‘‘అమ్మ’’ ఫ్యూచర్ చెప్పే డేట్ వచ్చేసింది?
X
తనను అభిమానంతో పిలుచుకునే పేరునే బ్రాండ్ గా మార్చేసి.. భారీగా ప్రచారం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (అభిమానంగా అందరూ అమ్మ అని పిలుస్తుంటారు) భవిష్యత్తు డిసైడ్ చేసే డేట్ వచ్చేసింది. తమిళనాడు అసెంబ్లీకి నిర్వహించాల్సిన ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం దాదాపుగా కన్ఫర్మ్ చేసింది.

తమిళనాడు రాజకీయాలు కాస్తంత చిత్రంగా ఉంటాయి. ఒకసారి ఒక పార్టీకి అవకాశం ఇచ్చే తమిళులు.. ఆ తర్వాత మరోసారి అధికారపార్టీకి అవకాశం ఇచ్చేందుకు పెద్దగా ఇష్టపడరు. గత కొన్నేళ్లుగా ఇదే సంప్రదాయం తమిళనాడట కొనసాగుతోంది. అయితే.. దాన్ని బ్రేక్ చేయాలన్న లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విభిన్నమైన పంధాలో సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న జయలలిత.. ‘అమ్మ’ ను భారీ బ్రాండ్ గా మార్చేశారు.

ఇదిలా ఉంటే.. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్ని ఈ ఏడాది మే 14న నిర్వహించాలన్న ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలతో చర్చిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. తమ పర్యటన ముగిసిన తర్వాత ఎన్నికల తేదీని అధికారికంగా ప్రకటించే వీలుంది.

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. మే14న తమిళనాడు మొత్తం ఒకే దఫాలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని.. 18న ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుతో పాటు.. పశ్చిమ బెంగాల్.. అసోం.. కేరళ.. పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల్ని మేలో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. చూస్తుంటే.. ఈ సమ్మర్ రాజకీయంగా మరింత హాట్.. హాట్ గా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు సుమా.