Begin typing your search above and press return to search.

పేరు పెట్టి పిలిస్తే అమ్మ ఏం చేసిందంటే..

By:  Tupaki Desk   |   25 July 2016 10:47 AM GMT
పేరు పెట్టి పిలిస్తే అమ్మ ఏం చేసిందంటే..
X
'అమ్మ'గా అంతా పిలుచుకునే త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత పేరు ఆ రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. ఏకంగా ప్ర‌తిప‌క్షాలు వాకౌట్ చేసే స్థాయికి ప‌రిస్థితి చేరిపోయింది. త‌ద్వారా పేరులో ఏముంది అని అనుకుంటాం కానీ ఆ పేరులోనే చాలా ఉంద‌ని త‌మిళ‌నాడు అసెంబ్లీ నిరూపించింది.

ఇటీవ‌లే ఎన్నిక‌లు జ‌రిగిన త‌మిళ‌నాడులో ఆ రాష్ట్ర అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల కోసం భేటీ అయింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర బ‌డ్జెట్ పై చ‌ర్చ సంద‌ర్భంగా అధికార పార్టీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే న‌ర‌సింహ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌ - మాజీ సీఎం డీఎంకే అధినేత క‌రుణానిధిని ఆయ‌న పేరుతో సంబోధించారు. దీనిపై డీఎంకే స‌భ్యులు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తంచేశారు. మాజీ ముఖ్య‌మంత్రిని పేరు పెట్టి పిల‌వ‌చ్చా అని స్పీక‌ర్ ధ‌న‌ప‌ల్‌ ను డీఎంకే స‌భ్యులు ప్ర‌శ్నించారు. దానికి స్పీక‌ర్ స్పందిస్తూ అందులో త‌ప్పేమీ లేద‌ని బ‌దులిచ్చారు. అలా అయితే సీఎం జ‌య‌ల‌లిత‌ను కూడా అలాగే పిల‌వ‌చ్చా అని అడిగితే అది కుద‌ర‌ద‌న్న ధ‌న‌ప‌ల్‌.. ఇది తన ఆర్డ‌ర్ అంటూ స్ప‌ష్టంచేశారు. దీనికి నిర‌స‌న‌గా డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. స్పీక‌ర్ ఆర్డ‌ర్ చ‌ట్ట విరుద్ధంగా ఉంద‌ని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని ప్ర‌తిప‌క్ష నేత ఎంకే స్టాలిన్ అన్నారు. ఎమ్మెల్యేల‌ను పేరు పెట్టి పిల‌వ‌ద్ద‌ని అసెంబ్లీ కోడ్‌ లో లేద‌ని, అలాంట‌పుడు జ‌య‌ల‌లిత‌ను పిలిస్తే త‌ప్పేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది త‌మిళ‌నాడు అసెంబ్లీ విచిత్ర పరిస్థితి.