Begin typing your search above and press return to search.

తేల్చేశారు; తాజ్ మహాల్ గుడి కాదు

By:  Tupaki Desk   |   1 Dec 2015 9:07 AM GMT
తేల్చేశారు; తాజ్ మహాల్ గుడి కాదు
X
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహాల్ కు సంబంధించి నెలకొన్న ఒక వివాదంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. తాజ్ మహాల్ స్మారక కట్టటం కాదని.. ఇదో దేవాలయం అంటూ కొందరు తెరపైకి తెచ్చిన వాదన.. లోక్ సభలో సభ్యుడి సందేహంగా మారింది. దీనిపై ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ సభ్యుడు ఒకరు లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేశ్ శర్మ స్పష్టమైన సమాధానం చెప్పారు.

తాజ్ మహాల్ హిందూ దేవాలయం అనటానికి సంబంధించి ఎలాంటి ఆధారం లేదని.. ఈ విషయంలో మరో మాట లేదని మంత్రి చెప్పారు. తాజ్ ను హిందూ దేవాలయంగా ప్రకటించాలని కోరుతూ అగ్రా లోని ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ కేసు సంగతి ప్రభుత్వానికి తెలుసని.. ఈ వివాదం వల్ల టూరిజనానికి వచ్చే నష్టం ఏమీ లేదని తేల్చేశారు.

ఇలాంటి వివాదాలు తెర మీదకు వచ్చిన వెంటనే. ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటనలు చేయటం మంచి పరిణామం. దీని వల్ల లేనిపోని పుకార్లకు.. ఊహాగానాలకు బలాన్ని ఇచ్చి.. దాన్నో వివాదంగా మార్చటం కన్నా.. మొగ్గలోనే తుంచేయటం మంచిది