Begin typing your search above and press return to search.

ర‌విప్ర‌కాశ్ హ‌ద్దులు దాటేశారు..ఇక అస్స‌లు వ‌దలొద్దు..!

By:  Tupaki Desk   |   12 Jun 2019 5:01 AM GMT
ర‌విప్ర‌కాశ్ హ‌ద్దులు దాటేశారు..ఇక అస్స‌లు వ‌దలొద్దు..!
X
టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో టీవీ9 పాత‌.. కొత్త యాజ‌మాన్యాలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌మ‌ను వేధించింది కాక‌.. ఇప్పుడు కొత్త బుర‌ద చ‌ల్ల‌టం ఏమిటంటూ వారు మండిప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. బెయిల్ పిటిష‌న్ మీద వాద‌న‌ల సంద‌ర్భంగా ర‌విప్ర‌కాశ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై టీవీ9 యాజ‌మాన్యాలు షాక్ తిన్న‌ట్లుగా తెలుస్తోంది.

వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసి కొన్న వ్యాపార సంస్థ‌ను ఎంత సింఫుల్ గా బ‌ద్నాం చేస్తార‌న్న‌ది టీవీ9 కొత్త యాజ‌మాన్యం భావ‌న అయితే.. ఇంత‌కాలం క‌లిసి చేశాం.. అన్ని చెప్పి.. ఓకే అన్న త‌ర్వాత అమ్మితే.. ఇలాంటి నింద‌లు వేయ‌టం స‌బ‌బా? అన్న‌ది పాత యాజ‌మాన్యంలోని కీల‌క వాటాదారు భావ‌న‌గా తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ స‌ర్లేన‌ని ఉపేక్షిస్తే.. మ‌రీ ఇంత‌లా హ‌ద్దులు దాటేస్తారా? సంస్థను పూర్తిగా దెబ్బ తీయ‌ట‌మే కాదు.. మూలాల మీదే మ‌ర‌క ప‌డేలా మాట్లాడ‌టాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఎంతైనా ఒక‌ప్పుడు క‌లిసి ఉన్నామ‌న్న భావ‌న‌తో ఉన్న త‌మ‌ను ఇంత‌లా అవ‌మానించిన ర‌విప్ర‌కాశ్ ను అస్స‌లు వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని.. అత‌గాడి విష‌యంలో అన్ని అంశాల్లోనూ దృష్టి సారించాల‌న్న భావ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

బెయిల్ పిటిష‌న్ పై వాద‌న‌లు వినిపించే వ‌ర‌కూ ర‌వి ప్ర‌కాశ్ విష‌యంలో అంతో ఇంతో ఉన్న సానుకూల‌త మొత్తం.. ఆయ‌న చేసిన తాజా ఆరోప‌ణ‌ల‌తో పూర్తిగా పోయిన‌ట్లుగా స‌మాచారం. కోర్టు ముందు త‌మ‌ను చిత్రీకరించిన తీరుపై కొత్త‌.. పాత యాజ‌మాన్యాలు అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నాయి.

స‌మాజంలో త‌మ‌కున్న పేరు ప్ర‌తిష్ఠ‌ల్ని దెబ్బ తినేలా ఆరోప‌ణ‌లు చేయ‌టానికి తెగించిన ర‌వి ప్ర‌కాశ్ విష‌యంలో లెక్క‌లు తేలాల్సిందేన‌ని.. అత‌గాడు త‌మ‌కు చేసిన అన్యాయాల‌కు సంబంధించిన చిట్టాను తెర మీద‌కు తేవాల‌న్న భావ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. రానున్న రోజుల్లో మ‌రిన్ని కేసులు వేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. వంద‌ల కోట్లు పోసి కొనుక్కున్న ఛాన‌ల్ ప్ర‌యోజ‌నాల‌తో పాటు.. త‌మ‌కున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసే చ‌ర్య‌ల్ని ఇక ఉపేక్షించేది లేద‌న్న అంశంపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.