Begin typing your search above and press return to search.

రవి ప్రకాష్ పై మండిపడుతున్న టీవీ 9 ఉద్యోగులు!

By:  Tupaki Desk   |   9 Oct 2019 5:30 PM GMT
రవి ప్రకాష్ పై మండిపడుతున్న టీవీ 9 ఉద్యోగులు!
X
మొన్నటి వరకూ ఒక సంస్థకు సీఈవోగా పని చేశారు. అది కూడా ఆ చానల్ ఆరంభం నుంచి పని చేశారు. ఆ చానల్ కు అంతా తానే అన్నట్టుగా వ్యవహరించారు. అంతా తన కనుసన్నల్లోనే నడిపించాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి అరెస్టు అయితే.. ఆ చానల్ లో ఇన్నాళ్లూ పని చేసిన వాళ్లు చాలా బాధపడిపోవాలి. రవి ప్రకాష్ కు సంఘీభావాలు ప్రకటించాలి. అయితే అందుకు భిన్నంగా టీవీ నైన్ ఉద్యోగులు రవి ప్రకాష్ మీద మండిపడుతూ ఉన్నారట. దీనికి కారణం ఏమిటంటే.. రవి ప్రకాష్ ఫోర్జరీ లీలలే అని పరిశీలకులు అంటున్నారు.

టీవీ నైన్ ఉద్యోగులకు బోనస్ పేరుతో యాజమాన్యం నుంచి తీసుకున్న సొమ్మును తన ఖాతాలకు మళ్లించుకున్నాడట రవి ప్రకాష్. బోనస్ ఉద్యోగుల పేరుతో తీసుకుని - వారికి ఆ డబ్బులు చేరనీయకుండా తన ఖాతాలకు మళ్లించుకున్నాడట. తమ పేరుతో కూడా ఇలా రవి ప్రకాష్ దోచుకోవడం పై టీవీ నైన్ సిబ్బంది మండిపడుతూ ఉంది. ఈ వ్యవహారం అసలు కథ ఇలా ఉంది.

టీవీ9 అమ్మకం పూర్తైన తరువాత దశాబ్దకాలంగా సంస్థనే నమ్ముకుని ఎంతో కొంత బోనస్ వస్తుందని ఆశిపడ్డ ఉద్యోగులకే రవిప్రకాష్ సున్నం పూశారు. బోర్డ్ అనుమతి లేకుండా రవి ప్రకాష్ బ్యాచ్ కోట్ల రూపాయలను విత్డ్రా చేసుకుని సొమ్ము చేసుకున్నట్టుగా తెలుస్తోందిజ ఉదయం లేవగానే టీవీ9 తన ఒక్కడి వల్లే ఈ స్థాయిలో ఉందని - అవినీతి లేని మెరుగైన సమాజం కోసం అనే ముసుగులో సంస్థలోని నిధులు అక్రమంగా తరలించారంటే ఆశ్చర్యం కలగకమానదు. టీవీ9 పేరుతో రవిప్రకాష్ - మూర్తి - క్లిఫర్డ్ పెరారీ 18 కోట్ల దోపిడి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయాడని సమాచారం. ఈ నేపథ్యంలో రవి ప్రకాష్ చుట్టూ ఈడి - సీబిఐ - మనీలాండరింగ్ - బ్లాక్ మెయింలింగ్ కేసు కూడా చుట్టుకోనున్నాయా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు.

ఆరున్నర కోట్ల రూపాయలను బోనస్ గా తీసుకున్న రవి ప్రకాష్ ఉద్యోగులకు మాత్రం కేవలం రెండే రెండుసార్లు బోనస్ ఇచ్చారు. అది కూడాఒకసారి సగం నెల జీతం మాత్రమే. బోనస్ ఇచ్చిన ఏడాది జీతాలు పెంచనే లేదు. 2014 తర్వాత మూడేళ్లు వరుసగా జీతాలు పెంచనే లేదు. తాను మాత్రం 6.50 కోట్లను తీసుకుని మరో ఐదున్నర కోట్లను బోనస్ రూపంలో మూర్తికి కట్టబెట్టాడని రవి ప్రకాష్ పై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆర్పీ అరెస్ట్తో టీవీ9 ఉద్యోగుల నుంచి ఏ మాత్రం సానుభూతి రాకపోవడానికి కారణం ఇదేనని అంటున్నారు పరిశీలకులు.

ఉన్నన్ని రోజులూ జీతాలు సరిగ్గా పెంచక - పెంచినా తన వారికే ఎక్కువ ఇచ్చి - చాలా మందిని నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి పీకేసి - కొంతమందికి జీతాలు కోసేసి ఒకటా రెండా... చాలా దారుణమైన ఉద్యోగ వ్యతిరేక చర్యలు ఆర్పీపై ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. ఏడాది కాలంలో సుమారు రూ.18 కోట్ల మేర టీవీ9 నిధులను రవిప్రకాష్ బృందం దారి మళ్లించినట్లు అలందా మీడియా ఫిర్యాదు చేసింది.