Begin typing your search above and press return to search.

తమ్ములందరికీ నగరమే కావాలట...

By:  Tupaki Desk   |   22 Sep 2018 5:16 PM GMT
తమ్ములందరికీ నగరమే కావాలట...
X
ముందస్తుకు మూహూర్తం దగ్గర పడతోంది. అధికార - ప్రతిపక్ష పార్టీలన్నీ గెలుపు కోసం నానాతంటాలు పడుతున్నాయి. తెలంగాణలో ఏ స్థానం నుంచి పోటి చేస్తే విజయం వరిస్తుందో లెక్కలు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికారానికి దూరంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు గెలుపు కోసం ఆత్రంగా ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కేడర్ లేదు. నాయకులూ తగ్గిపోయారు. ఒకరిద్దరు పెద్ద నాయకులు మాత్రమే మిగిలారు. వీరంతా నగరానికి చెందిన వారు కాదు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారు. తెలంగాణలో హైదారబాద్ మినహ మిగత ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి బలం లేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు తమ సొంత నియోజకవర్గాల నుంచి కాకుండా నగరంలోని పలు నియోజక వర్గాల నుంచి పోటి చేయాలనుకుంటున్నట్లు సమాచారం. సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌ పల్లి - మల్కాజ్‌ గిరి - శేర్లింగంపల్లి - ఖైరాతాబాద్ వంటి నియోజకవర్గాల నుంచి పోటి చేసి తెలంగాణ శాసన సభలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీకి బిసీ ఓటర్లతో పాటు చంద్రబాబు కులానికి చెందిన ఓటర్లు కూడా నగరంలోని పలు నియోజకవర్గాలలో ఉన్నారు. అభ్యర్దుల గెలుపోటములను వీరు శాసించే స్థితిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం విజయం సాధించి తెలంగాణ ఏర్పాటు కూడా కూకట్‌ పల్లి వంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్దే గెలిచారు. మిగత నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్దులు గట్టి పోటి ఇచ్చారు. ఈ క్రమంలో నగరంలోని ఏ నియోజకవర్గం నుంచి పోటి చేసిన గెలుపు ఖయామని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. దీంతో తమ సొంత నియోజకవర్గాలను కాదని హైదారబాద్ వైపు పరుగులు తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించేందుకు అన్నీ పార్టీలు మహా కూటమిగా కూడా ఏర్పడడంతో తెలంగాణ రాజధానిలో తాము విజయం సాధించగలమని నమ్మకంగా ఉన్నారు. దీంతో రాజధానిలోని వివిధ శాసనసభ స్థానాల నుంచి పోటి చేసేందుకు తెలుగు తమ్ముళ్లు ఉవ్విళూరుతున్నారు.