Begin typing your search above and press return to search.

టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాలో జగన్ మార్క్

By:  Tupaki Desk   |   17 Sep 2019 9:31 AM GMT
టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాలో జగన్ మార్క్
X
జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మక తిరుమల దేవస్థానానికి సంబంధించి టీటీడీ పాలకమండలి ఏర్పాటు విషయంలో జగన్ మార్క్ కనిపించేలా కసరత్తు చేశారు. ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన జగన్ ప్రభుత్వం.. ఎక్స్ అఫీషియోతో కలిపి మొత్తం 28 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేశారు.

గతంలో 18మంది సభ్యులతో పాలకమండలి ఉండేది. ఇప్పుడు దాని సంఖ్యను 28 మందికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్ ఆఫీషియోతో కలిపి పెద్ద ఎత్తున సభ్యుల్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ 28 మందిలో ఏపీకి చెందిన సభ్యులు ఎనిమిది మంది కాగా.. తెలంగాణ నుంచి ఏడుగురికి అవకాశం ఇచ్చారు.

అదే విధంగా తమిళనాడుకు నలుగురు సభ్యులు.. కర్ణాటక నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు. ఢిల్లీ.. మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి సభ్యత్వాన్ని ఇచ్చారు. టీటీడీ పాలకమండలిలో పలువురు ఎమ్మెల్యేలతో పాటు మహిళా కోటాలో కొందరికి అవకాశం కల్పించటం గమనార్హం. గతంలోని ఏ ప్రభుత్వం కూడా ఇంత వినూత్నంగా మండలిని నియమించలేదని చెబుతున్నారు. ఏపీకి చెందిన వారికి దాదాపు సరి సమానంగా తెలంగాణకు చెందిన వారిని సభ్యులుగా నియమించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా :

ఆంధ్రప్రదేశ్

1.వి.ప్రశాంతి
2.యువి రమణ మూర్తి (ఎమ్మెల్యే)
3.మల్లికార్జున రెడ్డి (ఎమ్మెల్యే)
4.గొల్ల బాబూరావు (ఎమ్మెల్యే)
5.కె.పార్థసారథి (ఎమ్మెల్యే)
6.డిపి అనంత
7.చిప్పగిరి ప్రసాద్ కుమార్
8.నాదెండ్ల సుబ్బారావు

తెలంగాణ

1.జె.రామేశ్వరరావు
2.బి.పార్థసారథి రెడ్డి
3.యు.వెంకట భాస్కర రావు
4.మూరంశెట్టి రాములు
5.డి.దామోదర్ రావు
6.కె.శివ కుమార్
7.పుట్టా ప్రతాపరెడ్డి

తమిళనాడు

1.కుమారగురు (ఎమ్మెల్యే)
2.ఎస్.శ్రీనివాసన్
3.డాక్టర్ నిచితా ముత్తువరపు
4.కృష్ణమూర్తి వైద్యనాథన్

కర్ణాటక

1.రమేష్ శెట్టి
2.సంపత్ రవి నారాయణ
3.సుధా నారాయణ మూర్తి

ఢిల్లీ

1.ఎం ఎస్ శివ శంకరన్

మహారాష్ట్ర

1.రాజేష్ శర్మ

ఎక్స్ అఫీషియో సభ్యులు
1.చైర్మన్ (టీయూడీఏ)
2. స్పెషల్ సీఎస్
3.కమిషనర్ ఎండోమెంట్స్
4. టీటీడీ ఈవో