Begin typing your search above and press return to search.

కన్నీటికి కశ్మీర్ మంటలు ఆరునా?

By:  Tupaki Desk   |   4 Dec 2016 6:47 AM GMT
కన్నీటికి కశ్మీర్ మంటలు ఆరునా?
X
ఆయన దేశ న్యాయవ్యవస్థలోనే అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి. కానీ... న్యాయ వ్యవస్థ, దేశం దుస్థితి చూసి తరచూ కన్నీరు కారుస్తున్నారు. నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు. ఆ కన్నీరు ఆయనలోని మానవతను చూపిస్తుంది కానీ, ఆ నిస్సహాయత మాత్రం 120 కోట్ల భారత ప్రజల్లో ఇప్పటివరకు ఉన్న న్యాయవ్యవస్థ మాకు అండగా ఉంటుందన్న భరోసాను దూరం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్ ఠాకూర్ మళ్లీ కన్నీరు పెట్టారు. న్యాయమూర్తుల కొరత కారణంగా లక్షల కేసులు పెండింగ్‌ లో ఉన్నాయంటూ కొన్ని నెలల క్రితం ఒకసారి ప్రధాని మోదీ సమక్షంలోనే కన్నీరు పెట్టిన ఠాకూర్ తాజాగా కశ్మీర్‌ లో స్కూళ్లకు నిప్పుపెడుతున్న ఘటనలపై స్పందిస్తూ ఆవేదన చెందారు. శనివారం జమ్మూలోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించి కన్నీరు పెట్టుకున్నారు. కాశ్మీర్‌ విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగే పరిస్థితులు లేవని ఆయన అన్నారు. పాఠశాలల్లో యాభై ఏండ్ల కిందటి పరిస్థితే ప్రస్తుతమూ ఉన్నదని చెప్పారు.

కాగా దేశంలో దారి తప్పుతున్న వ్యవస్థలను శాసించాల్సిన చీఫ్‌ జస్టిసే ఇలా పదే పదే కన్నీరు పెట్టి నిస్సహాయతను వ్యక్తం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆవేదన అర్థం చేసుకోదగినదే అయినా ప్రజలకు అండగా ఉండాల్సిన న్యాయవ్యవస్థలో సుప్రీం అయన ఆయనే అలా బేలగా మారితే ఎలా అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/