Begin typing your search above and press return to search.

చత్తీస్ ఘడ్ సీఎంగా సీనియర్ కే పట్టం

By:  Tupaki Desk   |   16 Dec 2018 5:55 AM GMT
చత్తీస్ ఘడ్ సీఎంగా సీనియర్ కే పట్టం
X
15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడిన కాంగ్రెస్ పార్టీ.. చత్తీస్ ఘడ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈరోజు రాయ్ పూర్ లో జరిగే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నారు. నిన్న రాహుల్ గాంధీ ఈ మేరకు ట్వీట్ చేశారు. చత్తీస్ ఘడ్ సీఎం రేసులో భూపేష్ బెగాల్, అంబికాపుర్ లామేకర్, టీఎస్ సింగ్ డియో, పార్టీ ఓబీసీ వింగ్ చీఫ్ తమ్రాద్వాజ్ సింగ్ మరియు ఫార్మర్ యూనియన్ మినిస్టర్ చంద్రదాస్ మహంత్ పేర్లను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది.

సీఎం అభ్యర్థిని తేల్చేందుకు కాంగ్రెస్ సీనియర్లు మల్లిఖార్జున్ ఖర్గే, పీఎ పునియా లను రాహుల్ గాంధీ నియమించారు. వారు ఈమేరకు ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమై సీఎం అభ్యర్థిపై అభిప్రాయ సేకరణ జరిపారు. వారిద్దరూ ఈరోజు రాయిపూర్ చేరుకుంటున్నారు. కాంగ్రెస్ శాసనసభా సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ఖర్గే వెల్లడిస్తారు.

ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చత్తీస్ ఘడ్ రాజధాని రాయిపూర్ లో కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం సమావేశం నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్న ఆ నలుగురిలో టీఎస్ సింగ్ డియో ముఖ్యమంత్రి రేసులో ముందున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత పీఎల్ పుణియా మాట్లాడుతూ .. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారం ముఖ్యమంత్రిని ఎంపిక చేసి డిసెంబర్ 17న సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు.

చత్తీస్ ఘడ్ సీఎంగా దాదాపు టీఎస్ సింగ్ పేరును దాదాపు ఖాయం చేసినట్టు సమాచారం. ఆయన రేపు సాయంత్రం చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిసింది. ఈ మేరకు ఖర్గే, ఫునియాలు ఈరోజు మధ్యాహ్నం శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పేరును ప్రకటిస్తారు. రేపు ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు వివిధ రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించింది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్నారు.

చత్తీస్ ఘడ్ లోని సుర్గుజా జిల్లా సర్గుజా సంస్థానికి టీఎస్ సింగ్ దేవ్ (67) 118వ వారసుడు. అంబికాపూర్ నుంచి టీఎస్ సింగ్ దేవ్ గెలిచాడు. 2008 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. 2014లో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత నలుగురు అభ్యర్థుల్లో టీఎస్ సింగే అత్యంత ఆస్తిపరుడు. దాదాపు 561 కోట్ల ఆస్తులుండి చత్తీస్ ఘడ్ ఎమ్మెల్యేల్లోనే ఈయన అత్యంత ధనవంతుడు. ఆర్థిక, అంగబలం ఉండడంతో ఈయన్నే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నియమిస్తోంది.