Begin typing your search above and press return to search.

గంట‌లో 29 జిల్లాల్లో శంకుస్థాప‌న‌ల హ‌డావుడి!

By:  Tupaki Desk   |   24 Jun 2019 4:55 AM GMT
గంట‌లో 29 జిల్లాల్లో శంకుస్థాప‌న‌ల హ‌డావుడి!
X
ఏం చేసినా భారీగా చేయ‌టం గులాబీ బాస్ కు అల‌వాట‌న్న సంగ‌తి తెలిసిందే. తాను అనుకున్న‌ది పూర్తి అయ్యే వ‌ర‌కూ నిద్ర‌పోని త‌త్త్వం కేసీఆర్ సొంతం. అధికార పార్టీ అయిన‌ప్ప‌టికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాల‌యాలు లేని వైనంపై ఆయ‌న రియాక్ట్ కావ‌టం.. మొన్న‌టి కేబినెట్ మీటింగ్ లో ఈ అంశాన్ని ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. అంతేనా ద‌స‌రా నాటికి ప్ర‌తి జిల్లాలో పార్టీ కార్యాల‌యాన్ని భారీగా ఏర్పాటు చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

అంతేనా.. మొత్తం 33 జిల్లాల్లోపార్టీ కార్యాల‌యాన్ని ఒకే మోడ‌ల్ లో పెద్ద ఎత్తున నిర్మించాల‌ని నిర్ణ‌యించ‌టం.. అందుకు అవ‌స‌ర‌మైన జాగాను కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి 11 గంట‌ల మ‌ధ్య కాలంలో 29 జిల్లాల్లో తొలిద‌శ‌లో పార్టీ కార్యాల‌యాల‌కు సంబంధించిన శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ఖ‌మ్మం.. వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో పార్టీ కార్యాల‌యాలు ఉన్నాయి. వ‌రంగ‌ల్ రూర‌ల్.. హైద‌రాబాద్ జిల్లాల్లో పార్టీ కార్యాల‌యాల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూమిని త్వ‌ర‌లో కేటాయించ‌నున్నారు.
ఇదిలాఉంటే.. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని

తొమ్మిది జిల్లాల్లో మంత్రులు.. మిగిలిన జిల్లాల్లోజిల్లాప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్లు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. సిరిసిల్ల‌లో ఏర్పాటు చేయ‌నున్న జిల్లా పార్టీ కార్యాల‌య శంకుస్థాప‌న‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ‌రు కానున్నారు. ఒక్కో జిల్లాలో రూ.60ల‌క్ష‌ల వ్య‌యంతో పార్టీ కార్యాల‌యాన్ని నిర్మించ‌నున్నారు. ఒకే స‌మ‌యంలో 29 జిల్లాల్లో చేప‌ట్ట‌నున్న శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని పండుగ మాదిరి నిర్వ‌హించేందుకు వీలుగా గులాబీ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.