Begin typing your search above and press return to search.

మల్లారెడ్డి ఆటలు ఇక చెల్లవా.?

By:  Tupaki Desk   |   9 Jun 2019 7:07 AM GMT
మల్లారెడ్డి ఆటలు ఇక చెల్లవా.?
X
మల్లారెడ్డి.. అనూహ్యంగా.. ఆశ్చర్యంగా తెలంగాణలో మంత్రి అయ్యారు. 2014లో టీడీపీ నుంచి మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి.. ఆ తర్వాత 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. అనూహ్యంగా కేసీఆర్, కేటీఆర్ ల మెప్పు పొంది మంత్రి పదవి పొందారు..

అయితే ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రి మల్లారెడ్డి తీరులోనూ మార్పు వచ్చిందట.. మంత్రి అయ్యాక ఆది నుంచి టీఆర్ఎస్ లో ఉన్న నేతలను పట్టించుకోకపోవడం.. వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన సీట్లు ఇవ్వకపోవడంతో ఈసారి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు దెబ్బ పడింది. అనూహ్యంగా కాంగ్రెస్ కు, టీఆర్ఎస్ రెబల్స్ కు సీట్లు వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా నడిచినా మల్లారెడ్డి తీరు కారణంగా మేడ్చల్ మాత్రం ప్రతిపక్షం , రెబల్స్ బలపడడం విశేషం.

మల్కాజిగిరి ఎంపీ సీటులో కూడా మల్లారెడ్డి ఎంతో మంది టీఆర్ఎస్ సీనియర్ నేతలున్నా.. తన అల్లుడిని బరిలోకి దింపాడు. రేవంత్ రెడ్డి లాంటి బలమైన నేతతో పోటీపడలేక ఆయన ఓడిపోయాడు. నిజానికి చాలా మంది స్థానిక టీఆర్ఎస్ నేతలున్నారు. ఎవరిని నిలబెట్టినా రేవంత్ ను ఓడించేవారట.. కానీ మల్లారెడ్డి ఫ్యామిలీ పాలిటిక్స్ ఓడించాయని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.

ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీలోని మొత్తం 42 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ కేవలం 19 మాత్రమే గెలిచింది. ఇక కాంగ్రెస్ 13 సీట్లు - బీజేపీ ఒకటి - 10 మంది టీఆర్ ఎస్ రెబల్స్ ఇండిపెండెంట్లు గెలిచారు. మల్లారెడ్డి అసలైన టీఆర్ఎస్ శ్రేణులను పక్కనపెట్టి తమ బంధుగణానికి సీట్లు ఇవ్వడం వల్లే ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోయిందని.. ఇలానే కొనసాగితే వచ్చే ఎన్ని నాటికి టీఆర్ఎస్ మరింత బలహీనపడుతుందని అంటున్నారు. సో మల్లారెడ్డి జాగ్రత్త మరీ..