Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ - టీడీపీ - బీజేపీ...ఈ నాన్చుడేంది?

By:  Tupaki Desk   |   21 March 2019 7:55 AM GMT
టీఆర్ ఎస్‌ - టీడీపీ - బీజేపీ...ఈ నాన్చుడేంది?
X
ఏడు విడుతల్లో జరగనున్న లోక్‌ సభ ఎన్నికల్లో తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చేసిన సంగ‌తి తెలిసిందే. 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజైంది. ఈనెల 10న 17వ లోక్‌ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో 17ఎంపీ స్థానాల్లో ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన - 28 వరకు ఉపసంహరణకు తుది గడువుగా సీఈసీ నిర్ణయించింది .

అయితే, మొదటి విడత నామినేషన్లు దాఖలుకు మిగిలింది రెండు రోజుల గ‌డువే అయిన‌ప్ప‌టికీ - తెలంగాణ‌లో ప్ర‌ధాన పార్టీలు మాత్రం అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌లేదు. 2నెల 23వ తేదీ - ఈనెల 25 న మాత్రమే నామినేషన్ల స్వీకరణ చేప‌ట్ట‌నున్నారు. హోలీ సంద‌ర్భంగా మ‌రియు 23న నాలుగో శనివారం - 24 న ఆదివారం సెలవు సంద‌ర్భంగా నామినేష‌న్లు స్వీక‌రించ‌రు. స్థూలంగా రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ టీఆర్ ఎస్ - బీజేపీ - టీడీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. టీఆర్ ఎస్ జాబితా గురువారం ఏ స‌మ‌యంలో అయినా విడుద‌ల కావ‌చ్చున‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా - అధికారిక జాబితా విడుద‌ల కాన‌ప్ప‌టికీ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించ‌డంతో కరీంనగర్‌ పార్లమెంట్ స్ధానానికి టీఆర్ ఎస్‌ అభ్యర్థిగా బోయిన్‌ పల్లి వినోద్‌ కుమార్‌ నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని సిద్ది వినాయక ఆలయంలో పూజలు చేసిన తర్వాత… కరీంనగర్‌ కలెక్టరేట్ లో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను ఆయన అందజేశారు. మ‌రోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ.. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి.. మాణిక్‌ రాజ్‌ కన్నన్‌ కు నామినేషన్‌ పత్రాలు అందజేసారు. హైదరాబాద్ ఎంపీగా కొనసాగతున్న అసద్ మరోసారి నామినేషన్ వేశారు.