Begin typing your search above and press return to search.

ఇది ఏం కూర్పు: కారులో అసంతృప్తి

By:  Tupaki Desk   |   19 Feb 2019 6:30 AM GMT
ఇది ఏం కూర్పు: కారులో అసంతృప్తి
X
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌ పై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో అసంత్రుప్తి జ్వాలలు రేగుతున్నాయి. పార్టీలో సీనియర్లను - ఉద్యమంలో పనిచేసిన వారిని వదిలేసి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టడంపై అసమ్మతి భగ్గుమంటోంది. మంత్రి వర్గ విస్తరణపై బహిరంగంగా ఎవరు పెదవి విప్పకపోయిన లోలోపల మాత్రం అగ్ని పర్వతం బద్దలయ్యేలా ఉంది. అయితే తమ అసంత్రుప్తిని - అసమ్మతిని వెల్లడించేందుకు మాత్రం ఏఒక్కరూ సిద్దంగా లేరు. తమ అననాయులు - అనుచరుల వద్ద తమ గోడు వెల్లబోసుకుంటున్నారు తప్ప బహిరంగంగా మాట్లేందుకు సైతం ఎవరూ ముందుకు రావడం లేదు.

ముఖ్యంగా పార్టీలో సీనియర్ నాయకుడు భారీ మేజారిటీతో గెలిచిన తన్నీరు హరీష్‌ రావుకు మంత్రి పదవి దక్కకపోవడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి కె, చంద్రశేఖర రావు తన కుమారుడిని అందలం ఎక్కించేందుకు హరీష్‌ రావును బలిపశువును చేసారని పార్టీలో చర్చ జరుగుతోంది. హరీష్ రావు లేని తెలంగాణ క్యాబినెట్ ఊహించుకోలేమని పార్టీ సీనియర్లే కాదు - క్రిందిస్దాయి కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు. అయితే తమ ఆగ్రహాన్ని - ఆవేదనను ఎవరితో పంచుకుంటే ఏం ముంచుకొస్తుందోనని లోలోపల కుమిలిపోతున్నారు. ఈ ఎన్నికలలో భారీ స్దాయిలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించడం వెనుక హరీష్‌ రావు పాత్ర ఉందని అంటున్నారు. "తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిన 88 స్దానాలలో కనీసం 30 స్దానాలు హరీష్‌ రావు వల్లే దక్కాయని. ముఖ్యంగా పార్టీకి తీవ్ర నష్టం వస్తుందనుకున్న కోడంగల్ నియోజకవర్గంలో విజయం సాధించడం వెనుక హరీష్‌ రావు మంత్రాంగమే ఉందని అంటున్నారు."

మహాబూబ్‌ నగర్ - మేదక్ - నిజామాబాద్ జిల్లాలలో పంటలు సస్యశ్యామలం కావడానికి ఎండిపోకుండా నీరు అందడానికి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు చేసిన క్రుషి ఎంతో ఉందని అంటున్నారు. ఆ విషయాన్ని ఎన్నికల సభలో చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఆ మాటే మరచిపోయారని వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు. ఇక ఈ మంత్రి మండలిలోను మహిళలకు చోటు కల్పించకపోవడం పట్ల మహిళ ఎమ్మెల్యేలే కాదు పార్టీలో ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఈ ఎన్నికలలో మహిళల ఓట్లతోనే గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ మహిళలకు మంత్రి వర్గంలో స్దానం కల్పించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. మొత్తానికి కేసీర్ తొలి క్యాబినెట్ విస్తరణ పార్టీలో అసంత్రుప్తిని మిగిల్చింది.